సీనియర్ హీరోలు ఒకప్పుడు యాడాదికి ఐదారు సినిమాలు రిలీజ్ చేసి హిట్స్ అందుకునే వారు. రోజుకు 24 గంటలు పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. నిర్మాతకు మేకింగ్ లో నష్టాలు రాకుండా గ్యాప్ లేకుండా పని చేసేవారు. అంత డెడికేషన్ గా షూటింగ్స్ చేసేవారు. కానీ ఇప్పుడు యంగ్ హీరోలు ఒక సినిమా రిలీజ్ చేసేందుకే ఏడాది సమయం తీసుకుంటున్నారు. పోనీ చేసిన ఆ ఒక్క సినిమా అయినా కూడా హిట్ అవుతుందా అంటే చెప్పలేని పరిస్థితి.
Also Read : SunPictures : సెన్సార్ బోర్డ్ పై హైకోర్టుకు సన్ పిచర్స్.. ఎన్నడా ఇది!
ఇప్పుడిదంతా ఎందుకంటే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ గ్యాప్ లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న అఖండ 2 షూటింగ్ ను జెట్ స్పీడ్ లో ముగించి డబ్బింగ్ కూడా చెప్పేసాడు. తన తరువాత సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేయబోతున్నాడు. రెండు వేరు వేరు కాలాలకు సంబంధిచిన కథతో వస్తున్నా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. అలాగే మరో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో బాలయ్య మరో సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలను ఒకే సారి సార్ట్ చేయబోతున్నారట. రెండు సినిమాలు ప్యార్లల్ గా షూటింగ్ చేసేలా డేట్స్ కూడా ఇచ్చేశారట బాలయ్య. 60 ప్లస్ వయసులోను గ్యాప్ లేకుండా ఒకేసారి రెండు సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. అది బాలయ్య కు సినిమాల పట్ల ఉండే డెడికేషన్. ఈ విషయంలో ఇప్పటి యంగ్ హీరోలు బాలయ్యని చూసి నేర్చుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాలయ్య నటించిన అఖండ 2 సెప్టెంబర్ 25న రిలీజ్ కు రెడీ గా ఉంది.
