Site icon NTV Telugu

Mollywood : మెగాస్టార్ కు పోటీగా యంగ్ హీరో సినిమా రిలీజ్

Mollywood

Mollywood

ఏప్రిల్ 10న తెలుగులోనే కాదు మాలీవుడ్‌లో కూడా భారీ కాంపీటీషన్ నెలకొబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో తలపడబోతున్నాడు వర్సటైల్ యాక్టర్ బాసిల్ జోసెఫ్. డొమినిక్ ది లేడీ పర్స్ ప్లాప్ తర్వాత ఈ మలయాళ మెగాస్టార్ నుండి వస్తోన్న మూవీ ‘భజూక. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్ పర్టేషన్స్ పెరిగాయి. గేమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న భజూక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరకు ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు మేకర్స్.

Also Read : Bommarillu Bhaskar : ఆరెంజ్ టూ జాక్.. స్టార్ హీరో రేంజ్ కు సిద్ధు

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో ఢీ అంటే ఢీ అంటున్నాడు ఈ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్. సూక్ష్మదర్శినీ, పొన్మన్ చిత్రాల్లో మంచి ఫెర్ఫామన్స్ చూపించిన బాసిల్ ఈసారి వెరైటీ గెటప్‌లో కనిపించబోతున్న మూవీ మరణమాస్. రీసెంట్లీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కామెడీ కమ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతుంది మరణమాస్. ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు మరో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ బ్రదర్స్. ఇప్పుడు ఈ సినిమాను కూడా ఏప్రిల్ 10నే థియేటర్లలోకి తీసుకువస్తున్నారు. ఏప్రిల్ 14న కేరళ విషు ఫెస్టివల్‌ను టార్గెట్ చేస్తూ ఈ రెండు బొమ్మలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ ఇద్దరికీ సినిమా హిట్టుకొట్టడం కీలకం కూడా. తొలుత.. మరణమాస్‌ను కేరళ కొత్త ఏడాదినే తీసుకురావాలని ఫస్ట్ అనుకున్నారు. కానీ లాంగ్ వీకెండ్ కూడా కలిసొచ్చే అంశం కావడంతో ఏప్రిల్ 10న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ భజూకతో పోటీకి దిగడం ఇప్పుడు టూ ఫిల్మ్స్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం కనిపిస్తోంది. మెగాస్టార్ వర్సెస్ యంగ్ హీరో పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారో మరో వారం రోజుల్లో తెలుస్తుంది.

Exit mobile version