టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ లో భారీ క్రేజ్ ను పొందారు. ఇటీవల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. రీసెంట్ గా ధోని ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు.ఈ సంస్థ నుంచి అతడి భార్య సాక్షి నిర్మాతగా ‘ఎల్జీఎం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఫీల్ గుడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను రమేష్ తమిళ మణి తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాలో హరీష్ కల్యాణ్ లవ్ టుడే ఫేమ్ ఇవానా అలాగే యోగి బాబు, మిర్చి విజయ్, నదియా సహా పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ‘ఎల్జీఎం’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల వేడుక చెన్నైలో ఎంతో గ్రాండ్ గా జరిగింది. చిత్రబృందంతో పాటు ధోనీ, ఆయన భార్య సాక్షి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తున్న హాస్య నటుడు యోగి బాబు ధోనీని ఒక ప్రశ్నను అడిగారు.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లోకి తనను కూడా చేర్చుకోవాలని కోరారు. దీంతో ధోనీ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. “చెన్నై టీమ్లో అంబటి రాయుడు రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం రాయుడు స్థానం అయితే ఖాళీగా ఉంది.కావాలంటే నేను టీమ్ మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడతాను. కానీ మీరు సినిమా షూటింగ్స్ తో ఎంతో బిజీగా ఉన్నారు. మా టీమ్ తరఫున కనుక ఆడితే మీరు నిలకడగా ఆడాలి. అలాగే మీకు ఇంకో విషయం చెబుతున్నా. అసలే మావాళ్లు ఫుల్ స్పీడ్తో బౌలింగ్ చేస్తారు.మిమ్మల్ని గాయపరచడానికి కూడా వాళ్లు ప్రయత్నిస్తారు. మీరు జాగ్రత్తగా ఆడాలి’ అని అనడంతో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.ఇక ‘ఎల్జీఎం’ సినిమా గురించి ధోని మాట్లాడుతూ.. “ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సినిమా షూటింగ్ అంతా తక్కువ సమయంలో పూర్తి అయ్యింది. ఈ సినిమాను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడవచ్చు. మూవీ అందరికీ ఎంతగానో నచ్చుతుంది. నా భార్య,కూతురుతో కలిసి కూర్చుని నేను ఈ సినిమా చూశాను. మా పాప సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసింది. ఈ సినిమా ముగ్గురి చుట్టూ తిరిగే ఓ సరదా కథ అని ఆయన తెలిపారు.తల్లి, భార్య మధ్య నలిగిపోయే పాత్రలో హీరో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా అందరికి కచ్చితంగా నచ్చుతుంది అని ధోని తెలిపారు..