‘రౌడీ బాయ్స్’కు ‘రాధేశ్యామ్’ హెల్ప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న “రౌడీ బాయ్స్” సినిమాకు హర్ష కొనుగంటి దర్శకత్వం వహించగా, ఈ మూవీ జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా “రౌడీ బాయ్స్” నిర్మాతలు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను కలిసి ఈ సినిమా నుండి నెక్స్ట్ సాంగ్ ను లాంచ్ చేయమని కోరారు. “యే జిందగీ” అనే టైటిల్ తో వస్తున్న స్నేహబంధానికి సంబంధించిన సాంగ్ ను ప్రభాస్ లాంచ్ చేశారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ ఈ సాంగ్ బాగుందని, ఆశిష్ అండ్ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ కొత్త పాట ఈరోజు ఉదయం 11 గంటలకు యూట్యూబ్‌లో విడుదల కానుంది.
Read Also : 65 ఏళ్ళ ‘సతీ సావిత్రి’
Also Read
“రౌడీ బాయ్స్”లో అనుపమ పరమేశ్వరన్, సహిదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి, కోమలీ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ మూడింటిని ఈరోజే విడుదల చేయనున్నారు. 11 గంటలకు, 2 గంటలకు, 5 గంటలకు వరుసగా సినిమాలో నుంచి పాటలను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకు “రౌడీ బాయ్స్” మ్యూజికల్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!