Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic OTT: ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు యశ్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ‘టాక్సిక్’ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయిన ఈ మూవీకి ఇప్పుడు ఓటీటీ రూపంలో మరో అవకాశం దక్కబోతుందా? ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాను ఎలా ఆదరిస్తారు? అనే చర్చ కూడా ఇప్పుడు బాగానే నడుస్తోంది. ప్రస్తుతం ‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ గురించి కొత్తగా ఓ తేదీ సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. 2026 సెప్టెంబర్ 25 నుంచి ఈ సినిమా ZEE5లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రావచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డేట్ పై ఇప్పటివరకు చిత్ర నిర్మాతలు కానీ, ZEE5 సంస్థ కానీ ఆఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. గతంలో కూడా ZEE5 ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుందనే వార్తలు వచ్చాయి. కానీ స్ట్రీమింగ్ డేట్ పై మాత్రం క్లారిటీ రాలేదు.
మరోవైపు ‘టాక్సిక్’ డిజిటల్ బిజినెస్ విషయంలో కూడా హాట్ హాట్ గా చర్చ నడిచింది. థియేటర్లలో సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఓటీటీ హక్కుల పై కూడా ప్రభావం పడినట్లు సమాచారం. సినిమా రిలీజ్ కు ముందు 150కోట్లకు పలికిన ధర, ప్రస్తుతం సుమారు రూ.30 కోట్ల ఆఫర్ తో మాత్రమే వాదులుకోవాల్సి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరింత ఎక్కువ ఆఫర్ వస్తుందని ఆశించి నిర్మాతలకు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో భారీ నష్టాలనే చవిచూసింది. ‘టాక్సిక్’లో యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వాసంత్ కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. యశ్ నుంచి ‘కేజీఎఫ్’ తర్వాత వచ్చిన సినిమా కావడంతో మొదటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
- Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
- Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
అయితే థియేటర్లలో నెగిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ఓటీటీ ప్రేక్షకుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉండొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. థియేటర్లలో నచ్చని సినిమాలు కూడా ఇంట్లో ప్రశాంతంగా చూసినప్పుడు కొత్తగా కనెక్ట్ అవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ‘టాక్సిక్’కు సెప్టెంబర్ 25న ZEE5లో స్ట్రీమింగ్ అంటూ వస్తున్న వార్తలు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుంది. థియేటర్లలో నిరాశపరిచిన ‘టాక్సిక్’కు ఓటీటీలో అయినా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందా, యశ్ సినిమా డిజిటల్లో తన సత్తా చూపిస్తుందా అనేది చూడాలి.
తాజావార్తలు
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!