సమంతా నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘యశోద’. ఇటివలే థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ ని రాబట్టిన ఈ మూవీ, ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యింది. సర్రోగసీ కాన్సెప్ట్ పైన రూపొందిన ఈ మూవీ ప్రదర్శన ఆపేయాలంటూ ‘ఈవా’ హాస్పిటల్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ హాస్పిటల్ పేరుని సినిమాలో వాడారు, తమ బ్రాండ్ ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయి అంటూ ‘ఈవా’ హాస్పిటల్ యాజమాన్యం కోర్ట్ ని ఆశ్రయించారు. దీంతో యశోద సినిమా కష్టాల్లో పడింది, ఒటీటీలో విడుదల అవ్వడం కష్టమనే అనుకున్నారు. విషయం పెద్దదవుతుండడంతో, యశోద మేకర్స్, ‘ఈవా’ అనే పేరు ఇక సినిమాలో కనపడదు అంటూ ఈ సమస్యకి ముగింపు పలికారు.
ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో యశోద సినిమా నిర్మాత ‘శివలెంక కృష్ణ ప్రసాద్’ మాట్లాడుతూ… “మా సినిమాలో ‘ఈవా’ అనే పేరుని కాన్సెప్ట్ ప్రకారం పెట్టింది. వేరొకరి మనోభావాలను దెబ్బతీయడానికి కాదు ‘ఈవా’ వారిని నేను కలిసి జరిగింది చెప్పాను. ఇక ఫ్యూచర్ లో ‘ఈవా’ అనే పదం యశోద సినిమాలో కనపడదు. మా నిర్ణయాన్ని ‘ఈవా’ వారు కూడా అంగీకరించారు. ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయ్యింది. ఇది తెలియక జరిగిన చిన్న డిస్టర్బెన్స్ మాత్రమే” అని చెప్పారు. ఇదే విషయంపై ‘ఈవా’ హాస్పిటల్ ఎండి ‘మోహన్ రావు’ మాట్లాడుతూ… “యశోద సినిమాలో మా హాస్పిటల్ పేరు వాడటంతో మేము హర్టింగ్ ఆయ్యాము. నిర్మాత చాలా తొందరగా సమస్యను క్లియర్ చేసారు. దీంతో సమస్య పరిష్కారం అయ్యింది. డాక్టర్స్ అందరూ కూడా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారు. సినిమా వాళ్ళు కూడా ప్రొఫెషన్ ను గౌరవించాలి. ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఠాకూర్ సినిమా లాగా జరిగింది అంటారు. సినిమా చాలా బలమైన మాధ్యమం” అన్నారు. మొత్తానికి రెండు వర్గాలు సమష్య పరిష్కారానికి ముందుకి రావడంతో యశోద ఇష్యూ ఇక్కడితో సాల్వ్ అయ్యింది. మరి యశోద సినిమా ఒటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.