యషిక ఆనంద్.. గత కొన్నిరోజుల క్రితం వరకు కోలీవుడ్ లో అమ్మడి పేరు మారుమ్రోగిపోయింది. గత ఏడాది మద్యంమత్తులో కారు యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో తన స్నేహితురాలు మృతి చెందగా.. యషిక తీవ్ర గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకొంది. కొన్ని నెలలు బెడ్ రెస్ట్ తరువాత ఇప్పుడిప్పుడే బయట ప్రపంచాన్ని చూస్తున్న అమ్మడు వచ్చిన వెంటనే అందాల ఆరబోతకు తయారయ్యింది. సోషల్ మీడియాలో తన అభిమానులకు మళ్లీ దగ్గరవడానికి.. నిత్యం ఫొటోలతో, వీడియోలతో ఆకట్టుకుంటుంది.
ఇక తాజాగా అమ్మడు.. పుష్ప సినిమాలో ట్రెండింగ్ లో ఉన్న సామి సామి సాంగ్ కి స్టెప్పులేస్తూ కనిపించింది. లంగావోణీలో వేసిన యషిక స్టెప్స్ తో అదరగొట్టింది. “నాలా అయితే నేను డాన్స్ చేయలేదు.. ఇక్కడివరకు రావడానికే నాకు ఆరునెలలు పట్టింది… కాబట్టి త్వరలోనే మళ్లీ డ్యాన్స్ చేస్తాను, కాకపోతే ఈ ప్రదేశంలో మాత్రం కాదు” అని చెప్పుకొచ్చింది. అంతా బానే ఉంది కానీ ఈ సమయంలోనూ ఈ హాట్ బ్యూటీకి ట్రోలింగ్ తప్పలేదు. ఒక నెటిజన్ ఏంటీ .. నువ్వింకా బతికే ఉన్నావా.. చచ్చిపోయావన్నారే అని కామెంట్ పెట్టాడు. ఇక దీనికి మరోక నెటిజన్ ప్రమాదంలో చనిపోయింది యషిక కాదు ఆమె స్నేహితురాలు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టినట్ వైరల్ గా మారింది. ఇకపోతే యషిక ఆనంద్ తెలుగులోనూ సుపరిచితురాలే. తెలుగులో వచ్చిన ‘చీకటి గదిలో చితకొట్టుడు’, ‘నోటా’ చిత్రాలలో అమ్మడు నటించి మెప్పించింది.
