Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash Toxic: కన్నడ ఇండస్ట్రీలో చిన్న హీరోగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసి పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హీరో ‘రాకింగ్ స్టార్’ యష్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ఈ సుల్తాన్, వెండితెరపై కనిపించి ఇప్పటికి ఎన్ని రోజులైందో తెలుసా? అక్షరాలా 1473 రోజులు(ఏప్రిల్ 26 వరకు) అంటే సుమారు నాలుగు ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. 2022 ఏప్రిల్ 14న విడుదలైన ‘కేజీఎఫ్ 2’, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సినిమాల్లో రాకీ భాయ్ యాక్టింగ్‌కు యావత్ దేశం మొత్తం ఫిదా అయ్యింది. కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన నాటి నుంచి నేటి వరకు (ఏప్రిల్ 26, 2026) అంటే 4 సంవత్సరాల 12 రోజులుగా అభిమానులు తమ అభిమాన హీరోని వెండితెరపై చూడాలని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
‘టాక్సిక్’ వచ్చేది అప్పుడే..
ఇంతటి సుదీర్ఘ గ్యాప్ తర్వాత యష్ నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘టాక్సిక్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యష్ నటిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌పై దేశవ్యాప్తంగా క్రేజ్ మామూలుగా లేదు. గతంలో (ఫిబ్రవరి 20న) రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్.. సగటు అభిమాని అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాలో యష్ ‘రాయ’ అనే పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో యష్ సరసన చాలా మంది స్టార్ హీరోయిన్లు కనిపించనున్నారు. గంగగా నయనతార, నదియాగా కియారా అద్వానీ, ఎలిజెబెత్‌గా హ్యూమా ఖురేషీ, రెబెకాగా తారా సుతారియా, మెలిసాగా రుక్మిణి వసంత్ అలరించనున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ కె.నారాయణతో కలిసి యష్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఈ పాన్ ఇండియా సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ పోన్ అయ్యింది. అనంతరం మేకర్స్ ఈ చిత్రాన్ని జూన్ 4, 2026న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో 39 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరోసారి యష్ మానియా స్టార్ట్ అవుతుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ రికార్డులను ‘టాక్సిక్’ అధిగమిస్తుందా లేదా అన్నది చూడాలి.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!