Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic English Version: రాకీ భాయ్‌గా యష్‌కు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత ఆయన నుంచి వచ్చే ప్రతి అప్డేట్ భారీ అంచనాలతోనే సాగింది. అలాంటి క్రేజ్‌తో విడుదలైన ‘టాక్సిక్ కు మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ వచ్చింది. ఏకంగా రూ.101 కోట్ల నెట్‌తో సినిమా ఖాతా తెరవడంతో యష్ మరోసారి తన స్టామినాను నిరూపించారని అనిపించింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు అనుకున్నంతగా సాగలేదు. ప్రేక్షకుల నుంచి నెగిటివ్ స్పందన రావడంతో సినిమా ఊపందుకోలేకపోయింది. ఇప్పుడు మరో విషయంలోనూ ఈ మూవీకి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ వెర్షన్‌కు వచ్చిన స్పందన అయితే మరింత ఆశ్చర్యపరుస్తోంది.
యష్ నటించిన ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ సెప్టెంబర్ 4న భారతదేశంలోని కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో విడుదలైంది. ముంబై, బెంగళూరు, గురుగ్రామ్, నోయిడా నగరాల్లో మాత్రమే మొత్తం 11 షోలతో ప్రదర్శించారు. ట్రేడ్ డేటా ప్రకారం తొలి రోజు ఈ ఇంగ్లీష్ వెర్షన్‌కు దేశవ్యాప్తంగా సుమారు 450 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దాంతో మొదటి రోజు వసూళ్లు దాదాపు రూ.1.40 లక్షలకే పరిమితమయ్యాయి. ఇలాంటి భారీ అంచనాలతో వచ్చిన యష్ సినిమా కొత్త వెర్షన్‌కు ఇంత తక్కువ స్పందన రావడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముఖ్యంగా గురుగ్రామ్, నోయిడాలో పరిస్థితి మరింత నీరసంగా కనిపించింది. ఈ రెండు నగరాల్లో కలిపి ఒక్కో నగరంలో 25 కంటే తక్కువ టికెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ రిపోర్టులు పేర్కొన్నాయి. ముంబై, బెంగళూరులో మాత్రం మిగతా ప్రాంతాలతో పోలిస్తే కొంత మెరుగైన ఆక్యుపెన్సీ నమోదైంది. అయినప్పటికీ మొత్తం మీద ఇంగ్లీష్ వెర్షన్‌కు వచ్చిన డిమాండ్ నిర్మాతలు ఆశించిన స్థాయిలో లేదనే విషయం తొలి రోజు గణాంకాలతో స్పష్టమవుతోంది.
Also Read
- Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
- Teachers Day Special: టీచర్ అంటే జీవితాన్ని మార్చేవాడు! తెలుగు తెరపై గురువును గుర్తుచేసే మూడు గొప్ప సినిమాలు
- Crime Thriller OTT: ఊపిరి సలపనివ్వని గంటా 56 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్
- Varanasi: మహేశ్ బాబు ‘వారణాసి’లో అదిరిపోయే బుల్ ఫైట్.. హైదరాబాద్ శివార్లలో షూటింగ్!
అయితే ఈ ఇంగ్లీష్ వెర్షన్ ను దాదాపు 17 నిమిషాలు తక్కువ నిడివితో రూపొందించారు. ఇంగ్లీష్ కట్ రన్‌టైమ్ సుమారు 2 గంటల 57 నిమిషాలు ఉండగా, మిగతా భాషల వెర్షన్ దానికంటే ఎక్కువ నిడివితో ఉంది. దీంతో కొత్త కట్ ద్వారా ఇంగ్లీష్ వెర్షన్ అయినా ఆకట్టుకోవాలని మేకర్స్ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కానీ ఈ కొత్త కట్ కూడా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 450 టికెట్ల అమ్మకాలు చూస్తే పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం ఇదే పరిస్థితి కొనసాగితే ఇంగ్లీష్ వెర్షన్ లైఫ్‌టైమ్ కలెక్షన్ రూ.10 లక్షల మార్కును కూడా చేరకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక ‘టాక్సిక్’ అసలు థియేట్రికల్ జర్నీని చూస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు కొన్ని కారణాలు కనిపిస్తాయి. ఆగస్టు 26న కన్నడ ఒరిజినల్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ డబ్బింగ్ వెర్షన్లు విడుదలయ్యాయి. మొదటి రోజే రూ.101.10 కోట్ల నెట్ వసూళ్లు రావడంతో సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అంచనాలు పెరిగాయి. కానీ తొలి రోజు తర్వాత నెగెటివ్ టాక్ తో వసూళ్లు గణనీయంగా పడిపోయాయి. ‘టాక్సిక్’ 10 రోజులు పూర్తి చేసుకునేసరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 331 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. 2026 ఆగస్టు 26న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి రోజునే ఏకంగా రూ. 101.10 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించి సంచలనం సృష్టించింది. అయితే నెగిటివ్ టాక్ తో 10వ రోజు నాటికి భారతదేశంలో ఈ మూవీ రూ. 241.05 కోట్ల నెట్ కలెక్షన్లను (రూ. 287.75 కోట్ల గ్రాస్) సాధించగా, ఓవర్సీస్ నుండి మరో రూ. 43.25 కోట్ల గ్రాస్ వసూలైంది. 2000వేల కోట్లు వసూలు చేస్తుందని అనుకున్న ఈ మూవీకి ఈ కలెక్షన్స్ చాలా తక్కువే. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రికవరీ కానట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!