కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని మళ్లీ టాప్ ప్లేస్ లో నిలబెట్టిన సినిమా పఠాన్. ఈ మూవీ జనవరి 25న రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న పఠాన్ సినిమా నెల రోజులు తిరగకుండానే బాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. 850 కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా ఇప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్ ని మైన్తైన్క్ చేస్తుంది. ఇదే జోష్ మరికొన్ని రోజులు క్యారీ చెయ్యగలిగితే పఠాన్ సినిమా 1000 కోట్ల మార్క్ ని టచ్ చెయ్యడం పెద్ద కష్టమేమి కాదు. పఠాన్ ర్యాంపేజ్ ముందు నిలిచి కూడా మిగిలిన రికార్డ్ ఏదైనా ఉందా అంటే అది బాహుబలి 2 హిందీ కలెక్షన్స్ రికార్డ్ మాత్రమే. హిందీలో బాహుబలి 2 సినిమా 511 కోట్లని రాబట్టింది, పఠాన్ ఓవరాల్ థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకునే లోపు బాహుబలి 2 రికార్డ్స్ క్ ఎసరు పెట్టే ఛాన్స్ ఉంది. అయితే పఠాన్ స్పీడ్ ని తగ్గిస్తూ మరో సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కి రెడీ అయ్యింది.
ఫెబ్ 14th వ్యాలెంటైన్స్ డే సంధర్భంగా షారుఖ్-యష్ రాజ్ ఫిల్మ్స్-కాజోల్ కాంబినేషన్ లో వచ్చిన ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా రీరిలీజ్ కాబోతుంది. వారం రోజుల పాటు నేషనల్ చైన్స్ లో DDLJ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు యష్ రాజ్ ఫిల్మ్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాలీవుడ్ హిస్టరీలోనే DDLJ సినిమాకి ఒక ఆల్ టైం క్లాసిక్ అనే ముద్ర ఉంది. ఈ జనరేషన్ యూత్, ఈ ఐకానిక్ సినిమాని థియేటర్స్ లో చూసి ఉండరు కాబట్టి DDLJ మూవీని చూడడానికి ప్రేమజంటలు థియేటర్స్ వైపు వెళ్తాయి. ఈ ఇంపాక్ట్ పఠాన్ సినిమా కలెక్షన్స్ ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. పఠాన్ మూవీ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది అని తెలిసినా యష్ రాజ్ ఫిల్మ్స్ DDLJని ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలియదు కానీ లవర్స్ కి మాత్రం ఒక మంచి సినిమా అయితే ఇస్తున్నారు. మరి తనతో తనకే పడిన ఈ పోటీలో షారుఖ్ ఖాన్ DDLJ సినిమాతో ప్రేమికుల మనసు గెలుస్తాడా? లేక పఠాన్ సినిమాతో బాహుబలి 2 కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తాడా అనేది చూడాలి.
Come fall in love with #DDLJ all over again, in cinemas tomorrow onwards for 1 week! ❤️
Celebrate Valentine's week at @_PVRCinemas | @INOXMovies | @IndiaCinepolis Book your tickets now! https://t.co/0tbSwwC8vw | https://t.co/Nhp0L79gwl pic.twitter.com/ymCyMV3oQR
— Yash Raj Films (@yrf) February 9, 2023