Yash Puri: టీజర్ లాంచ్ తో ‘హ్యాపీ ఎండింగ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యశ్ పూరీ, అపూర్వ రావు జంటగా రూపొందుతున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ పల్లాల మాట్లాడుతూ, ” ఈ బ్యానర్ లో సినిమాలు చేస్తూనే.. కొత్తగా వచ్చే నిర్మాతలకు, ఆర్టిస్టులకు ఒక బ్రిడ్జ్ గా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇక సినిమా విషయానికి వస్తే.. మూడేళ్ల క్రితం దర్శకుడు కౌశిక్ మా దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతను మా దగ్గరే ఓ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. ఆ టైమ్ లోనే యశ్ కూడా కలిశాడు. తర్వాత కౌశిక్ చెప్పిన ఓ లైన్ నచ్చి మళ్లీ పిలిపించాం. ఆ లైన్ నుంచి స్టార్ట్ అయిన సినిమానే ఈ ‘హ్యాపీ ఎండింగ్”’ అని అన్నారు. దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ.. ”ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్యూ చెబుతున్నాను. వాళ్లు నన్ను బాగా నమ్మారు. ఇక నా టీమ్ చాలా సపోర్టింగ్ గా ఉంది. సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. మ్యూజిక్ పరంగా చాలా జానర్స్ ను టచ్ చేసినట్టు కనిపించినా.. చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందనుకుంటున్నాను” అన్నారు. యాక్టర్ విష్ణు మాట్లాడుతూ ”టీజర్ లో కనిపించిన పిల్లలు.. నేను డైరెక్టర్ కౌశిక్ అనుకోవచ్చు. మేం కూడా స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇద్దరం కలిసి సినిమా చేశాం. ఇది ఒక విచిత్రమైన సినిమా. నా పాత్ర కూడా విచిత్రంగా ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు. హీరోయిన్ అపూర్వ రావు మాట్లాడుతూ, “ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఇది నా డెబ్యూ ఫిల్మ్. కొత్తగా వచ్చే మాలాంటి వారికి మీడియా ఇంత సపోర్ట్ ఉన్నందుకు థ్యాంక్యూ. నేను ఒంగోలులో పుట్టి గుజరాత్, గల్ఫ్ లో పెరిగాను. స్టడీస్ తర్వాత హైదరాబాద్ వచ్చాను. చాలామంచి ప్యాసినేట్ మూవీ టీమ్ తో పనిచేశాను. డైరక్టర్ కౌశిక్ కల్ట్ ఫిల్మ్ మేకర్ అవుతాడు. ఈ సినిమాలో భాగం అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ చెబుతున్నాను” అని అన్నారు.
చిత్ర దర్శకుడు కౌశిక్ మాట్లాడుతూ, “ఇక్కడికి వచ్చి గెస్ట్ లందరికీ థ్యాంక్యూ సో మచ్. సినిమా టీజర్ ను కావాలనే షార్ట్ గా కట్ చేశాం. ఏ మాత్రం లెంగ్త్ పెంచినా కంటెంట్ లీక్ అవుతుంది. అందుకే హీరోయిన్ ను కూడా చూపించలేదు. అయితే ఈ టైటిల్ వినగానే చాలా ఊహించుకుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదు. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ కథను మూడేళ్ల క్రితం అనిల్ గారికి చెప్పాను. అప్పుడే ఆయన చాలా నవ్వుకున్నారు. ఆయనే ప్రొడ్యూస్ చేస్తే బావుంటుందనుకున్నాను. చివరికి ఆయనే చేస్తుండటం హ్యాపీగా ఉంది. సినిమాకు సంబంధించి టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఎప్పటికీ మరవలేను. ఇక రైటర్ మ్యాజిక్ ఏంటనేది.. సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా హీరో యశ్ గురించి చెప్పాలి. యశ్ ఖచ్చితంగా ఓ ప్రామిసింగ్ యాక్టర్ గా ఎదుగుతాడు. హీరోయిన్ పాత్ర సినిమా అంతా ఉంటుంది. తన పాత్ర మీ అందరికీ నచ్చుతుంది” అని అన్నారు. హీరో యశ్ మాట్లాడుతూ “ఇక్కడున్న మా అందరికీ ఒకటే లవర్. అదే సినిమా. ఈ ప్రేమ వల్లే తెలుగు ఆడియన్స్ ఇంత సక్సెస్ ఇస్తున్నారు. వారి ప్రేమ వల్లే.. టాలీవుడ్ బెస్ట్ ఇండస్ట్రీ అయింది. ఇది నాకు మూడో సినిమా. సినిమా మీద ప్రేమతోనే ఈ ‘హ్యాపీ ఎండింగ్’ తీశాం. ఇది కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్. అంటే పిల్లాడి నుంచి వ్యక్తిగా మారే కథ. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఒక పాత్రలాగే ఉన్నారు. ఇది ది బెస్ట్ టీమ్ అని చెబుతాను. వీరిని తెలుగు సినిమా భవిష్యత్ అని కూడా చెప్పొచ్చు. మా టీజర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్యూ సో మచ్.. ” అని చెప్పారు. ఈ కార్యక్రమం లో హీరోలు కార్తీక్ రత్నం, తిరువీర్, త్రిగుణ్, తమ్మారెడ్డి భరద్వాజ్, శేఖర్ సూరి తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!