‘కెజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇటీవల రిలీజ్ అయిన కెజిఎఫ్ 2 చిత్రంతో మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ నటుడిగా తన కెరీర్ ని ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగిన యష్ జీవితం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇక యష్ భార్య రాధికా పండిట్ గురించి కూడా అందరికి తెలిసిందే. ‘మోగ్గినా మనసు’ అనే చిత్రం ద్వారా ఈ జంట వెండితెర ప్రవేశం చేశారు. ఆ సినిమా షూటింగ్ లోనే ప్రేమలో పడిన రాధిక, యష్ పెద్దవాళ్ళను ఒప్పించి వివాహం తో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. ఒకరు కూతురు ఐరా కాగా మరొకరు కొడుకు యతర్వ్ కావడం విశేషం.
యష్ తో పెళ్ళైన తరువాత రాధికా పండిట్ సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ ఉంది. ఇక తాజాగా ఒక ఫంక్షన్ లో ఈ అందమైన ఫ్యామిలీ ఇదుగో ఇలా దర్శనమిచ్చింది. సంప్రదాయమైన దుస్తుల్లో రాధికా, పిల్లలు ఎంతో అందంగా ఉన్నారు. ముఖ్యంగా పాప ఐరా ఎంతో ముద్దుగా ఉంది. ఇక ప్రస్తుతం యాష్ అభిమానులు ఈ ఫోటోను నెట్టింట వైరల్ గా మారింది. క్యూట్ ఫ్యామిలీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
