Site icon NTV Telugu

సూర్య హ్యాట్రిక్ కొడతాడా!?

ET

ET

సూర్య నటించిన తాజా సినిమా ‘ఎదరుక్కుమ్ తునిందవన్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వినయ్ రాయ్, సత్యరాజ్, శరణ్య, సూరి ఇతర ముఖ్య పాత్రధారులు. ఇమామ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. సూర్య బ్యానర్ 2డి ఎంటర్ టైన్మెంట్ లో ‘పసంగ2’ సినిమాను దర్శకత్వం వహించిన పాండిరాజ్ 2019లో సొల్లాచ్చి సెక్యువల్ అసాల్ట్ కేస్ ఆధారంగా తయారు చేసుకున్న కథతో తీస్తున్న సినిమా ఇది. ఇంకో విశేషం ఏమంటే సూర్య తండ్రి శివకుమార్ ఇదే టైటిల్ తో గతంలో ఓ మూవీ చేశారు.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఇందులో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు హీరో సూర్య కోటి రూపాయల విలువైన గోల్డ్ కాయిన్స్ ను బహుమతిగా ఇవ్వటం టాక్ ఆఫ్ ద కోలీవుడ్ అయింది. నిజానికి ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయాలనుకున్నారు. అయితే కోవిడ్ వల్ల ఫిబ్రవరి 4కు వాయిదా వేశారు. అయినా పరిస్థితులు అనుకూలించకపోడంతో ఇప్పుడు మార్చి 10న విడుదల చేయనున్నారు. ఇప్పుడు తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో మార్చి 10న ప్రపంచ వ్యాప్తంగా రానుంది సూర్య నటించిన ‘ఎదరుక్కుమ్ తునిందవన్’. థియేటర్లలో విడుదలైన సూర్య చివరి సినిమా ‘బందోబస్త్’. ఆ తర్వాత సూర్య నటించిన రెండు సినిమాలు ‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’ డైరెక్ట్ గా డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయి అటు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందాయి. ఓ దశలో ‘ఎదరుక్కుమ్ తునిందవన్’ కూడా డైరెక్ట్ ఓటీటీలో విడుదల అవుతుందనే వినిపించింది. అయితే ఖచ్చితంగా థియేటర్లలో విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు ధృవీకరించారు. ఈ సినిమా కూడా హిట్ అయితే సూర్య హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. అది జరగాలని కోరుకుందాం.

Exit mobile version