Steven Spielberg : స్పీల్ బెర్గ్ కు ఈ సారి ఏమవుతుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఈ పేరు వింటే చాలు ఇప్పటికీ ఎంతోమంది అభిమానుల మది ఆనందంతో చిందులు వేస్తుంది. ఆయన సినిమాలను చూసి ఎందరో దర్శకులుగా మారాలని పరుగులు తీశారు. స్పీల్ బెర్గ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా పలువురు డైరెక్టర్స్ గా మారారు. అలాంటి స్పీల్ బెర్గ్ తన ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ద్వారా ఈ సారి బెస్ట్ డైరెక్టర్ విభాగంలో నామినేషన్ పొందాడు. ఆయనతో పాటు `ద పవర్ ఆఫ్ ద డాగ్’ సినిమాతో జేన్ క్యాంప్లన్, ‘బెల్ ఫాస్ట్’తో కెన్నెత్ బ్రనగ్, ‘డ్రైవ్ మై కార్’తో ర్యుషుకే హమగుచి, ‘లికోరైస్ పిజ్జా’ ద్వారా పాల్ థామస్ ఆండర్సన్ ‘బెస్ట్ డైరెక్టర్’ బరిలో ఉన్నారు. ఇప్పటిదాకా బెస్ట్ డైరెక్టర్ గా జాన్ ఫోర్డ్ నాలుగు సార్లు అవార్డును సొంతం చేసుకొని చెదరని రికార్డ్ తో ఉన్నారు. ఇక ఈ విభాగంలో అత్యధిక నామినేషన్స్ సంపాదించిన దర్శకుడెవరంటే విలియమ్ వైలర్. ఆయన పన్నెండు నామినేషన్స్ సంపాదించి, మూడుసార్లు బెస్ట్ డైరెక్టర్ గా నిలిచారు. ఈ సారి నామినేషన్ తో బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో స్పీల్ బెర్గ్ కు ఎనిమిదో నామినేషన్ దక్కింది. అందువల్ల స్పీల్ సైతం ముచ్చటగా తన ఖాతాలో మూడో సారి బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ సొంతం చేసుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
1993లో ‘షిండ్లర్స్ లిస్ట్’తో బెస్ట్ డైరెక్టర్ అవార్డుతో పాటు బెస్ట్ పిక్చర్ ను కూడా కైవసం చేసుకున్నాడు స్పీల్. తరువాత ఐదేళ్ళకు 1998లో ‘సేవింగ్ ప్రైవేట్ ర్యాన్’తో మరో బెస్ట్ డైరెక్టర్ అవార్డును అందుకున్నాడు. అలా ఇప్పటికి మూడు ఆస్కార్ అవార్డులు స్పీల్ బెర్గ్ సొంతమయ్యాయి. ఇప్పటి దాకా బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ఎనిమిది, తరువాత నిర్మాతగా తొమ్మిది సార్లు అకాడమీ నామినేషన్స్ అందుకున్నాడు స్పీల్. వెరసి 17 నామినేషన్స్ సంపాదించాడు స్పీల్. 1977లో తొలిసారి ‘క్టోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్’ సినిమాతో బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ నామినేషన్ స్పీల్ బెర్గ్ ను వరించింది. తరువాత “రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్, ఇ.టి.: ఎక్స్ ట్రా టెరస్టియల్, షిండ్లర్స్ లిస్ట్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, మ్యూనిక్, లింకన్” చిత్రాలకూ బెస్ట్ డైరెక్టర్ విభాగంలో స్పీల్ బెర్గ్ ను నామినేషన్స్ దక్కాయి. ఇప్పుడు ఎనిమిదో సారి బెస్ట్ డైరెక్టర్ విభాగంలో ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ద్వారా నామినేషన్ అందుకున్నాడు స్పీల్ బెర్గ్.
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
స్టీవెన్ స్పీల్ బెర్గ్ కు మరో ఆస్కార్ తప్పకుండా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అమెరికాలో ఓ జ్యోతిషుడు కూడా చెప్పాడట. దాంతో అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. కానీ, స్పీల్ తో పాటు ఈ సారి నామినేషన్స్ సంపాదించిన నలుగురు దర్శకులు కూడా తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారని తెలుస్తోంది. అందువల్ల ఈ సారి స్పీల్ బెర్గ్ కు ఏమవుతుందో చూడాలని అటు అభిమానులు, ఇటు సామాన్య సినీఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏమవుతుందో మార్చి 28వ తేదీ అవార్డుల ప్రదానోత్సవంలో తేలిపోనుంది.
తాజావార్తలు
-
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
-
Trump: ట్రంప్‌నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!