Nidhi Agarwal : అందాలన్నీ నిధులుగా పోస్తే నిధి అగర్వాల్ అవుతుందేమో అన్నట్టుగా ఉంటుంది ఈ బ్యూటీ. అందానికి అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా అన్ని ట్యాలెంట్స్ తనలోనే దాచుకుంది. కానీ ఏం లాభం.. స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. అదేం దురదృష్టమో గానీ.. అమ్మడి కెరీర్ లో హిట్ల కంటే ప్లాపుల సంఖ్య డబుల్ గా ఉంది. ఇస్మార్ట్ శంకర్, భూమి, కలగ తలైవాన్, హీరో, మిస్టర్ మజ్ను.. ఇలా అన్నీ ప్లాప్ అయ్యాయి. అందులో ఏ రెండు సినిమాలు హిట్ అయినా బ్యూటీ రేంజ్ ఈ పాటికి వేరే లెవల్లో ఉండేది. తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉండేది. అయినా ఇప్పుడు ఆమెకు మంచి అవకాశాలే చేతిలో ఉన్నాయి.
Read Also : Samantha : స్టార్ డైరెక్టర్ తో సమంత పవర్ ఫుల్ మూవీ..?
ఎన్నో ఏళ్ల తర్వాత హరిహర వీరమల్లు మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. పవన్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా. ఐదేళ్లుగా ఆగిన ఈ మూవీ.. ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీలో హీరోయిన్ గా చేసిన నిధి.. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేసంది. కానీ అవన్నీ ప్లాప్. వీరమల్లుతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఇది భారీ హిట్ అయితే మాత్రం నిధికి మళ్లీ ఛాన్సుల వరద ఖాయం. ఇంతకు ముందు ఉన్న ప్లాపుల ఫలితాలు పోయి.. హిట్ ఫార్మాట్ వచ్చేస్తుంది. అప్పుడు టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల్లో కూడా ఛాన్సులు రావొచ్చు అంటున్నారు. మరి వీరమల్లు నిధిని కాపాడుతాడా లేదా అన్నది చూడాలి.
Read Also : Vijay Sethupathi : నా కొడుకు చేసిన పనికి క్షమించండి..
