Anushka : స్వీటీ అనుష్క మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 5న ఆమె నటించిన ఘాటీ మూవీ రిలీజ్ కాబోతోంది. క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ప్రమోషన్లు మాత్రం కెమెరాల ముందుకు రాకుండానే చేస్తోంది అనుష్క. నిన్న హీరో రానాతో ఫోన్ లో మాట్లాడి ప్రమోషన్ చేసింది. అలాగే ప్రింట్ మీడియాకు ఫోన్ లో నుంచే ఇంటర్వ్యూలు ఇస్తోంది. రానాతో మాట్లాడుతూ మరోసారి హీరో ప్రభాస్ తో మూవీ చేయాలని ఉందని తన మనసులో మాటను బయట పెట్టేసింది. కానీ ఆయనతో చేయాలంటే బాహుబలి కంటే బెటర్ కథ వస్తేనే బాగుంటుందని చెప్పింది.
Read Also : OG : పవన్ మేనరిజంతోనే ప్రమోషన్ పేలిపోతుందా..?
దీంతో ఈ టాపిక్ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది. బాహుబలి కంటే బెటర్ కథ అంటే సాధ్యమేనా.. ఒకవేళ కథ దొరికినా దాన్ని ఆ స్థాయిలో తీయాలంటే మళ్లీ రాజమౌళితోనే సాధ్యం. మరి ఆ కాంబో మళ్లీ కలిసే ఛాన్స్ ఉందా. అలా కలిస్తే అది బాహుబలి-3 కోసమే కావాలి. కానీ ఇప్పట్లో బాహుబలి సబ్జెక్ట్ ను జక్కన్న ముట్టుకునే ఛాన్స్ లేదు. ఆయన షెడ్యూల్ చాలా బిజిగా ఉంది. మహేశ్ తో సినిమా అయిపోగానే మహాభారతంపై ఫోకస్ పెట్టబోతున్నాడు. అది ముట్టుకుంటే ఇంకో పదేళ్లు అయినా ఆయన బిజీనే. ఆ లోపు ప్రభాస్, అనుష్క ఏజ్ ఫ్యాక్టర్ కుదరకపోవచ్చు. మొత్తంగా చూసుకుంటే అనుష్క కోరిక నెరవేరుతుందా లేదా అనేది అనుమానంగానే ఉంది.
Read Also : Akhanda-2 : అఖండ-2 రిలీజ్ అప్పుడేనా..?
