Site icon NTV Telugu

Nagarjuna : జగపతిబాబును తన సినిమాలో వద్దన్న నాగార్జున.. ఎందుకంటే..?

Nagarjuna

Nagarjuna

Nagarjuna : కింగ్ నాగార్జున ఫుల్ జోష్‌ లో ఉన్నాడు. మొన్ననే కుబేరతో భారీ హిట్అందుకున్నాడు. ఇప్పుడు కూలీ సినిమాలో విలన్ గా ఇరగదీసి తనలోని నెగెటివ్ కోణాన్ని బయట పెట్టాడు. ఈ రెండు పాత్రలు బాగా హిట్ అయ్యాయి. దీంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు నాగార్జున. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకు గెస్ట్ గా వచ్చాడు నాగ్. అక్కినేని అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని నాగవంశీతో కలిసి నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ తండ్రి పాత్ర కోసం ముందుగా జగపతి బాబును అడిగారంట. అయితే నాగార్జున వద్దన్నాడనే ప్రచారం ఉంది.

Read Also : RGV : కుక్కలనే పెళ్లి చేసుకోండి.. డాగ్ లవర్స్ కు ఆర్జీవీ కౌంటర్

ఆ విషయంపై తాజాగా జగపతి బాబు ప్రశ్నించాడు. ఎందుకు వద్దన్నావు అని అడిగాడు. నాగ్ బదులిస్తూ.. నువ్వు నా ఫ్రెండ్ వి. మనం ఇప్పటికే చాలా తక్కువగా కలుసుకుంటున్నాం. అంత చిన్న పాత్ర నువ్వు చేయడం ఏంటని నేను వద్దన్నాను. అలా చేస్తే మన ఫ్రెండ్ షిప్ దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే వద్దన్నాను అంటూ తెలిపాడు. నువ్వు ఆ సినిమాకు ఒక నిర్మాతవు. మరో నిర్మాత కూడా ఉన్నారు కదా. నువ్వు ఇలా చేయడం మంచిదే అనుకో. కానీ అఖిల్ తో నటించాలని నాకు కూడా ఉంది ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటూ తెలిపాడు జగపతి బాబు.

Read Also : Soumya Rao : అక్కడ చేతులేశాడు.. రాత్రంతా బస్టాండ్ లోనే.. యాంకర్ షాకింగ్ కామెంట్స్

Exit mobile version