Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeethu Joseph: మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించిన ‘దృశ్యం’ సిరీస్‌కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ‘దృశ్యం’ సిరీస్ నుంచి వచ్చిన రెండు భాగాలు మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల మలయాళం, తెలుగులో ‘దృశ్యం-3’ రిలీజ్ అయిన మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘దృశ్యం-3’ తెలుగు రీమేక్ ఎందుకు కాలేదో డైరెక్టర్ జీతూ జోసెఫ్ వెల్లడించారు. వాస్తవానికి గతంలో వచ్చిన రెండు పార్ట్స్ తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కానీ ఈ మూడో పార్ట్ మాత్రం మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన దృశ్యం -3 నే తెలుగులో కూడా విడుదల చేశారు. ఇలా ఎందుకు జరిగిందో తాజాగా డైరెక్టర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ జీతూ జోసెఫ్ మాట్లాడుతూ.. ఇతర భాషల్లోని స్టార్ హీరోల ఇమేజ్, వారికున్న ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుంటే, ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మలయాళంలో మోహన్‌లాల్ క్యారెక్టరైజేషన్‌కు, తెలుగులో ఉండే హీరోల ఇమేజ్‌కు ఉన్న వ్యత్యాసాల వల్లే తెలుగు రీమేక్ సాధ్యం కాలేదని వెల్లడించారు. తెలుగు రీమేక్ క్యాన్సిల్ అయినప్పటికీ, హిందీలో మాత్రం ‘దృశ్యం-3’ రీమేక్ కాబోతోందని జీతూ జోసెఫ్ వెల్లడించారు. బాలీవుడ్ మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారని ఆయన తెలిపారు. “హిందీ మేకర్స్ ఇప్పటికే రైట్స్ తీసుకున్నారు. అయితే అక్కడి ప్రేక్షకుల అభిరుచికి, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా క్లైమాక్స్ మార్చుకుంటామని నన్ను మర్యాదపూర్వకంగా అడిగారు. దానికి నేను కూడా సంతోషంగా అంగీకరించాను” అని జీతూ జోసెఫ్ వెల్లడించారు. దీంతో హిందీలో అజయ్ దేవగన్ హీరోగా ‘దృశ్యం-3’ రావడం పక్కా అయిపోయింది.
Also Read
- Janvi Kapoor: 'పెద్ది' దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
తాజావార్తలు
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!