సమంత నటించిన తమిళ చిత్రం ‘కన్మణి రాంబో ఖతీజా’ ఈ నెల 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ సరసన సమంత ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అది గురువారం పూజా కార్యక్రమాలతో మొదలై పోయింది. ఇక సమంత నటించిన ఉమెన్ సెంట్రిక్ ‘యశోద’ మూవీ ఆగస్ట్ 12, ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ ‘శకుంతల’ విడుదల కాబోతున్నాయి.
ఈ సంగతి ఇలా ఉంటే… సమంత శుక్రవారం సాయంత్రం చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యేకంగా ఒకరిని టార్గెట్ చేస్తూ అని కాకుండా జనాంతికంగా సమంత ఈ ట్వీట్ చేసింది. ‘నా నిశ్శబ్దాన్ని అజ్ఞానంగానూ, నా మౌనాన్ని అంగీకారంగానూ, నా జాలిని బలహీనతగానూ తప్పుగా భావించకండి’ అని అందులో పేర్కొంది. అంతవరకూ బాగానే ఉంది… దానికి కొనసాగింపుగా ‘జాలికి ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది’ అంటూ మరు నిమిషంలో జస్ట్ సేయింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ముక్తాయింపు ఇచ్చింది. సో… సమంత అతి త్వరలోనే ఎక్స్ పైరీ డేట్ కాగానే తన నిశ్శబ్దాన్ని, మౌనాన్ని, జాలిని పక్కన పెట్టేయబోతోంది. ఎవరెవరిని అమ్మడు ఏ విధంగా నిలదిస్తుందో, కడిగేస్తుందో మరి…. బీ రెడీ!!
https://twitter.com/Samanthaprabhu2/status/1517468903295033344