ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లని రాబట్టాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తర్వాత రవితేజ ట్రాక్ మర్చి సీరియస్ మోడ్ లోకి వచ్చేసాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రవితేజని కొత్తగా ప్రెజెంట్ చేసాయి. పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా రవితేజ ఎంటర్ అయ్యాడు కాదు సాలిడ్ హిట్ అనేది మిస్ చేసాడు. హ్యాట్రిక్ హిట్ కొట్టి ఉంటె రవితేజ మార్కెట్ ఊహించని విధంగా పెరిగేది. అలా జరగకపోవడం వలన ఇప్పుడు రవితేజ మళ్లీ రీజనల్ మార్కెట్ ని స్టిక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతికి ఈగల్‌గా రాబోతున్నాడు కాబట్టి ఈ మూవీ పాన్ ఇండియా హిట్ కొడితే రవితేజ మళ్లీ ట్రాక్ ఎక్కేసినట్లే అవుతుంది. కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తర్వాత రవితేజ నెక్స్ట్ మూవీ ఏంటి అనే దానిపై ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చలు జరుగుతున్నాయి.
హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో కలిసి రవితేజ ఒక సినిమా అనౌన్స్ చేసాడు. రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతుంది అనుకున్న ఈ ప్రాజెక్ట్ ఉన్నపళంగా ఆగిపోయింది. ఇదే రవితేజ నెక్స్ట్ మూవీ అని అంతా ఫిక్స్ అయిపోయాక ఇప్పుడు రవితేజ నెక్స్ట్ సినిమా ఎవరు అనే ప్రశ్న మొదలవ్వడం ఇదే మొదటిసారి. గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ఆగిపోయింది కాబట్టి రవితేజ నెక్స్ట్ తన కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ఇద్దరు డైరెక్టర్స్ తో ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీ అయ్యేలా ఉన్నాడు. రవితేజకి మిరపకాయ్ లాంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్, జాతిరత్నాలు సినిమాతో హిట్ కొట్టిన అనుదీప్ కేవీలు ప్రస్తుతం రవితేజతో ప్రాజెక్ట్ విషయంలో వెయిటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో రవితేజ ఇమ్మిడియట్ గా ఎవరితో సినిమా చేస్తాడు లేక రెండు ఒకేసారి స్టార్ట్ చేస్తాడా? లేదా రెండు ప్రాజెక్ట్స్ ని హోల్డ్ లో పెట్టి ఈగల్ సినిమా రిలీజ్ అయ్యాకా డెసిషన్ తీసుకుంటాడా అనేది చూడాలి.