NTV Telugu Site icon

Telugu Indian Idol : ఫస్ట్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే….

Telugu Indian Idol

Telugu Indian Idol

వారం వారం తెలుగు ఇండియన్ ఐడిల్ ఇంట్రస్టింగ్ గా సాగిపోతోంది. తాజాగా ఈ వారం నుండి ఎలిమినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. శుక్రవారం ఉగాది పచ్చడి తినడంతో ఎపిసోడ్ మొదలైతే, శనివారం ఎపిసోడ్ మిఠాయిలతో ప్రారంభమైంది. శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘బంగారు బుల్లోడు’ మూవీలోని ‘స్వాతిలో ముత్యమంత…’ గీతాన్ని పాడాడు. అతని రేంజ్ కు తమన్ ఫిదా అయ్యి… అది రేంజ్ కాదు రేంజ్ రోవర్ అంటూ కితాబిచ్చాడు. ఇక నిత్యామీనన్… శ్రీనివాస్ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్థావించడం చూసి ఆమెతో ఓ సెల్ఫీ దిగేశాడు తమన్. ఎపిసోడ్ ప్రారంభంలోనే కార్తీక్ ఎయిర్ పోర్ట్ లో తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పి, కంటెస్టెంట్స్ ను ఉత్తేజ పరిచాడు. తెలుగు ఇండియన్ ఐడిల్ ‘కంటెస్టెంట్స్ షో’గా మారిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన జయంత్ ‘యమగోల’లోని పాట పాడాడు. అయితే అతని డాన్స్ తాను మిస్ అయ్యానని తమన్ చెప్పడంతో ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాట పాడి, శ్రీరామచంద్రతో కలిసి స్టెప్పులేశాడు జయంత్. ఆ ఊపుకు ఇతర కంటెస్టెంట్స్ తో పాటు తమన్, కార్తీక్ సైతం నర్తించాడు. ఇక తెలుగు ఇండియన్ ఐడిల్ లో యంగెస్ట్ కంటెస్టెంట్ వైష్ణవి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లోని ‘అధరమదోల అదిరినదేలా’ గీతాన్ని అద్భుతంగా పాడటంతో జడ్జీలు ‘బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్’ అని అభినందించారు. ఆ తర్వాత రేణు కుమార్ ‘పైసా వసూల్’ మూవీ టైటిల్ సాంగ్ ను తనదైన స్టైల్ లో డాన్స్ చేస్తూ పాడాడు. అయితే… డాన్స్ కు తగ్గట్టుగా పాడలేదంటూ తమన్ కాస్తంత నిరుత్సాహం ప్రదర్శించాడు. ఇక లక్ష్మీ శ్రావణి ‘చెన్నకేశవరెడ్డి’లోని ‘హాయి హాయి హాయీ’ పాటను పాడింది.

Read Also : Raid At Pudding & Mink Pub : రాత్రి నుంచి స్టేషన్ లోనే నిహారిక

‘అఖండ’ అఛీవ్ మెంట్ వెనుక అసలు కారణం!
ఈ ఎపిసోడ్ లో చివరగా మాన్య చంద్రన్ ‘భైరవ ద్వీపం’లోని ‘విరిసినది వసంత గానం’ పాటను పాడింది. ఈ సందర్భంగా తమన్ తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ‘భైరవ ద్వీపం’కు తన తండ్రి శివకుమార్ డ్రమ్మర్ గా వర్క్ చేశారని చెప్పారు. డ్రమ్స్ శివమణి తన తండ్రి శిష్యుడేనని, ఆయన తనను అప్పట్లో బాగా ప్రోత్సాహించేవారని చెప్పారు. ‘భైరవ ద్వీపం’ మూవీ రికార్డింగ్, రీరికార్డింగ్ సమయంలో తనకూ డ్రమ్స్ వాయిచే ఛాన్స్ నిర్మాతలు ఇచ్చారని, అంతేకాకుండా ఆర్.ఆర్.కు వర్క్ చేసినందుకు పారితోషికం కూడా ఇచ్చారని తెలిపారు. తన తండ్రి వర్క్ చేసిన చివరి సినిమా ‘భైరవ ద్వీపం’ అని, ఆ చిత్రానికి ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, బాలకృష్ణ చిత్రంతో అలా ఏర్పడిన అనుబంధం కారణంగానే ఇటీవల వచ్చిన ‘అఖండ’కు అలాంటి సంగీతాన్ని ఇవ్వగలిగానని తమన్ చెప్పారు. అంతేకాదు… జై బాలయ్యా అంటూ నినాదం చేశారు. విశేషం ఏమంటే… ఈ రెండు ఎపిసోడ్స్ లోనూ పన్నెండు మంది కంటెస్టెంట్స్ లో పదిమంది బాలకృష్ణ సినిమాల్లోని పాటలను, ఇద్దరు ఎన్టీయార్ మూవీస్ లోని పాటలను పాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కంటెస్టెంట్స్ ను ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ఉగాది సందర్భంగా వారందరికీ గిఫ్ట్స్ పంపారు.

ఎలిమినేట్ అయిన జస్కరన్!
తెలుగు ఇండియన్ ఐడిల్ లోని 12 మంది కంటెస్టెంట్స్ లో ఈ వారం పెర్ఫార్మెన్స్ ను దృష్టిలో పెట్టుకుని కనిష్టం ఓట్లు, పాయింట్లు సంపాదించుకున్న మాన్య చంద్రన్, జస్కరన్, మారుతిని శ్రీరామచంద్ర వేదిక మీదకు పిలిచాడు. వారిలోంచి జస్కరన్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు. పంజాబీ అయ్యి ఉండి, తెలుగు భాష నేర్చుకుని, చక్కని పాటలు పాడిన జస్కరన్ ను అభినందిస్తూ జడ్జిస్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఈసారి పెర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ గా వైష్ణవి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంది. మొత్తం మీద ఈ వీకెండ్ లో బాలయ్య బాబు సినిమాల్లోని మెలోడీ, మాస్ సాంగ్స్ తో వ్యూవర్స్ ను కంటెస్టెంట్స్ ఆకట్టుకున్నారు.