Mahesh Babu: జక్కన్న గండం దాటించే ధీరుడు ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి, మహేష్ బాబు కాంబో అంటే ఆ లెక్క మామూలుగా ఉండదు. దాదాపు పదేళ్లుగా ఈ కాంబో డిలే అవుతూనే ఉంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకి SSMB 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పేశాడు జక్కన్న. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఈ లెక్కన మహేష్ బాక్సాఫీస్ టార్గెట్ 2500 కోట్లకు పైగా ఉంటుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఈ సినిమాతో మహేష్ బాబుకి కూడా గ్లోబల్ రీచ్ రావడం, మహేహ్స్ బాబు అనే బ్రాండ్ ప్రపంచానికి పరిచయం అవ్వడం గ్యారెంటీ. ఖచ్చితంగా ఇప్పటివరకూ ఉన్న మహేష్ బాబు బాక్సాఫీస్ లెక్కలన్నీ మార్చేయనున్నాడు రాజమౌళి. ఇంటర్నేషనల్ స్పేస్ లో, ఇండియానా జోన్స్ రెంజులో SSMB 29ని జక్కన్న ప్రాజెక్ట్ చేస్తాడు.
మరి ఇలాంటి ఇంటర్నేషనల్ సినిమా తర్వాత మహేష్ బాబుతో చేయబోయే డైరెక్టర్ ఎలా ఉండాలి? రాజమౌళిని కొట్టేలా ఉండాలి. మరి అలాంటి డైరెక్టర్ ఎవరు? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ 30కి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడనే టాక్ జోరుగా నడుస్తోంది. రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి లేదా బాబీ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అలాగే వంశీ పైడిపల్లి, కొరటాల శివ కూడా లైన్లో ఉన్నారు. వీళ్లలో ఎవరితో ఒకరితో.. రాజమౌళి తర్వాత మహేష్ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. అయితే వీళ్ల లెక్క తేలాలంటే.. ముందు రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లాలి.. రిలీజ్ అవ్వాలి. దానికి ఇంకో రెండు, మూడేళ్ల సమయం ఉంది. కాబట్టి.. ఇప్పట్లో ఎస్ఎస్ఎంబీ 30 గురించిన వార్తలు అనవసరమనే చెప్పాలి. ఒకవేళ SSMB 30 గురించి నిజంగానే మాట్లాడాలి అంటే రాజమౌళి తర్వాత మహేష్ బాబుతో సినిమా చెయ్యడానికి సత్తా ఉన్న దర్శకుడు సుకుమార్ మాత్రమే. పుష్ప 2 రిజల్ట్ తో సుక్కూ రేంజ్ మారిపోతుంది, ఇకపై తను కూడా అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తాడు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు ఇంటర్నేషనల్ రీచ్ ని సొంతం చేసుకోని, సుకుమార్ తో సినిమా చేస్తే అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లోనే ఉంటుంది. సుకుమార్ స్క్రీన్ ప్లేకి ఒక రేంజ్ ఉంటుంది, 1 నేనొక్కడినే సినిమా ఇక్కడ ఆడలేదు కానీ సుక్కూ-మహేష్ బాబుల కాంబినేషన్ ఇలాంటి సినిమా ఒకటి SSMB 30కి సెట్ అయితే ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్ రేంజులో ఉంటుంది.
Also Read
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
తాజావార్తలు
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
-
Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్‌లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
-
Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
-
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్లో సీఏఏ స్టార్ట్..
-
KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!