Nagarjuna: ఆ ఒక్క విషయంలో క్లారిటీ లేదు కింగ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందో సినిమా ఏ హీరోకైనా చాలా స్పెషల్ గా ఉంటుంది. అప్పటివరకూ చేసిన 99 సినిమాలకి పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని హీరోలు ప్లాన్ చేస్తుంటారు. ‘ది ఘోస్ట్’తో 98 సినిమాలు కంప్లీట్ చేసిన నాగార్జున, మైల్ స్టోన్ మూవీని ఎవరితో చేయాలా అనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఖోరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ మాస్టర్ దర్శకత్వంలో 99వ సినిమా చేస్తున్న నాగార్జున, సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తున్నాడు. నా సామీ రంగ అనే టైటిల్ తో ఇటీవలే అనౌన్స్ అయిన ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్ కీరవాణితో ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ మూవీ అవ్వగానే వందో సినిమా సినిమాని స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు కింగ్ నాగ్. అయితే అసలు ఆ బెంచ్ మార్క్ సినిమాకి దర్శకుడిని నాగార్జున ఫైనల్ చేశాడా లేదా అనేది అక్కినేని అభిమానులకి అంతుబట్టని విషయంగా మారింది. మెగాస్టార్ చిరు ‘త్రినేత్రుడు’ సినిమాతో, బాలయ్య ‘గౌతమీ పుత్ర శాతకర్ణీ’ సినిమాలతో సెంచరీ బెంచ్ మార్క్ ని రీచ్ అయ్యారు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి, ఇప్పుడు తన వందో సినిమాతో అలాంటి హిట్ కొట్టాలనే ప్లాన్ వేస్తున్నాడు కింగ్ నాగార్జున. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అయితే నాగార్జున బెంచ్ మార్క్ మూవీని ‘మోహన్ రాజా’ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా చేతిలో తన వందో సినిమా బాధ్యతని పెట్టడానికి నాగ్ ప్రిపేర్ అవుతున్నాడట. గాడ్ ఫాదర్ సినిమా ఫ్లాప్ అయినా కూడా చిరు లాంటి స్టార్ హీరోని మోహన్ రాజా చూపించిన విధానం నచ్చి నాగార్జున అతనికి ఈ అవకాశం ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఎక్కువగా రీమేక్ సినిమాలే చేసి హిట్స్ కొట్టిన మోహన్ రాజా, సొంతకథతో ‘తనీ ఒరువన్’ లాంటి కమర్షియల్ హిట్ కొట్టాడు పైగా మోహన్ రాజా ఇప్పుడు తనీ ఒరువన్ సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇది కంప్లీట్ అయ్యాకా మోహన్ రాజా నాగార్జున కలిసి సినిమా చేస్తున్నారా లేదా అనే విషయంలో క్లారిటీ వస్తుంది. అప్పటివరకూ నాగార్జున తన సెంచరీ సినిమా బాధ్యత ఎవరి చేతిలో పెట్టనట్లే.
Also Read
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
- Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
- Shah Rukh Khan: 'నా భర్త కంటే మీరే ఇష్టం'.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్‌లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!