Sharukh Khan : బాలీవుడ్ ఆల్ టైమ్ సూపర్ స్టార్లలో షారుఖ్ ఖాన్ ఒకరు. గతేడాది జనవరి 25కి ముందు షారుఖ్ పరిస్థితి ఏంటో తెలియరాలేదు. పఠాన్ బ్లాక్ బస్టర్ కాకముందు పదేళ్లలో ఒక్క హిట్ కూడా లేకుండా షారుక్ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిసిందే. ముఖ్యంగా పఠాన్ కంటే ముందు వచ్చిన జీరో సినిమా అతడి మార్కెట్‌ని దారుణంగా దెబ్బతీసింది. ఆ సినిమా రిజల్ట్స్ చూసిన తర్వాత చాలామంది షారుఖ్ పని అయిపోయిందని అనుకున్నారు.
ఈ దెబ్బకు షారుఖ్ రెండేళ్లకు పైగా సినిమాల వంక చూడలేదు. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత చేసిన పఠాన్‌తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తర్వాత జవాన్, డంకీ కూడా మంచి ఫలితాలు సాధించారు. అయితే వరుస పరాజయాలు ఎదురైనప్పుడు ఏ హీరో అయినా డిప్రెషన్‌కు లోనవుతారు. తాను కూడా చాలా పెయిన్ ను అనుభవించానని.. అయితే తన వైఫల్యాలకు ఎవరినీ నిందించనని షారుఖ్ చెప్పుకొచ్చాడు. దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో షారుఖ్ తన కెరీర్‌లో బ్యాడ్ డేస్ గురించి మాట్లాడాడు.
Read Also:AR Rahman Divorce: ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలి: రెహమాన్ తనయుడు
నా కెరీర్ విషయంలో ఎవరినీ నిందించటం నాకు ఇష్టం లేదు. నేను బాత్రూంలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ నా బాధను ఎవరి ముందు చూపించను. ఎందుకంటే నేను నా బాధను తగ్గించుకోగలను. ఈ ప్రపంచం మనపై కుట్ర చేస్తోందని ఎప్పుడూ అనుకోకండి. ఈ ప్రపంచం మనకు వ్యతిరేకం కాదు. కొన్నిసార్లు అది మన తప్పు కాకపోవచ్చు. అయినప్పటికీ, వైఫల్యాలు జరుగుతాయి. దానికి చాలా కారణాలున్నాయి.
మన పనే సరికాదని ఒప్పుకోవాలి. అప్పుడు మనం ముందుకు సాగాలి. నోరుమూసుకుని లేచి పని చేయమని మనమే చెప్పుకోవాలి. ఈ లోకంలో మనం చిన్న చీమ అని అర్థం చేసుకోవాలి. ప్రపంచం తన పని తాను చేసుకుంటుంది. అపజయాలకు ఎవ్వరినీ నిందించకుండా మన పని మనం చేసుకుపోవాలని, ఆయన తత్వాన్ని గుర్తు చేసుకున్నారు. గతేడాది పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో ఒకే ఏడాది మూడు వేల కోట్లు రాబట్టిన హీరోగా రికార్డు సృష్టించాడు షారుక్.
Read Also:Maharaja : ఇది కదా మహారాజా స్టామినా అంటే.. ఏకంగా 40వేల థియేటర్లలో రిలీజ్