Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. గబ్బర్ సింగ్ తో పవన్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఈ సినిమా కోలీవుడ్ చిత్రం తేరి రీమేక్ గా తెరకెక్కుతోందని తెల్సిందే. అయితే పూర్తి రీమేక్ కాదని, కేవలం లైన్ మాత్రమే తీసుకున్నారని, మిగతాదంతా హరీష్ కొత్త కథను రాసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే గత కొన్నిరోజులుగా ఈ చిత్రంలో పవన్ సరసన లక్కీ బ్యూటీ శ్రీలీల నటిస్తుందని వార్తలు పుట్టుకొచ్చాయి. పెళ్లి సందD చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే అందరి మనసులను గెలిచేసింది.
Ram Charan: చరణ్ ఇంట్లో కుక్కలా పుట్టినా బావుండేది.. రైమ్ లక్కీ బేబీ
ఇక ఆ తర్వాత ధమాకాతో అదిరిపోయే హిట్ అందుకొని.. స్టార్ హీరోల పక్కన లక్కీ ఛార్మ్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ ను పట్టేసింది. అందరు అనుకున్నట్టుగానే.. శ్రీలీలనే ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. నేటి నుంచి ఆమె షూటింగ్ లో పాల్గున్నట్లు తెలుస్తోంది. సెట్ లోకి శ్రీలీలను హరీష్ శంకర్, నవీన్ యెర్నేని పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతించారు. ఇక ఇంకా సీనియర్ హీరోయిన్లకు కూడా రానీ ఛాన్స్ ను అమ్మడు తన ఐదో సినిమాకే అందుకోవడం గ్రేట్ అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే మహేష్ సరసన ssmb28 లో, బోయపాటి – రామ్ సినిమాలో రామ్ సరసన నటిస్తోంది. మరీ ఈ లక్కీ బ్యూటీ లక్ .. ఈ సినిమాను హిట్ చేస్తుందా..? లేదా అనేది తెలియాలి.