Site icon NTV Telugu

రికార్డు ధరకు “వారియర్” హిందీ రైట్స్

The Warrior

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం “వారియర్”. రామ్ ఈ ద్విభాషా చిత్రంతో కోలీవుడ్‌ లో అరంగేట్రం చేస్తున్నాడు. ఆది పినిశెట్టి విలన్‌గా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న “ది వారియర్” చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Read Also : హిందీలో అజిత్ “విశ్వాసం”… వద్దంటున్న స్టార్ హీరోలు

ఇక తాజాగా “వారియర్” హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఈ భారీ ధర “వారియర్”పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు, ఇటీవల విడుదలైన రామ్ ఫస్ట్ లుక్, టైటిల్ ద్వారా ఏర్పడిన సానుకూల వైబ్స్ కు నిదర్శనం. క్రిమినల్స్ కోసం వేట సాగించే టఫ్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ ని పోస్టర్ లో చూపించారు. దీంతో ఒక్కసారిగా “వారియర్”పై అంచనాలు పెరిగిపోయాయి.

Exit mobile version