రికార్డు ధరకు “వారియర్” హిందీ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం “వారియర్”. రామ్ ఈ ద్విభాషా చిత్రంతో కోలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. ఆది పినిశెట్టి విలన్‌గా, కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న “ది వారియర్” చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ఇటీవలే మొదలైంది. ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
Read Also : హిందీలో అజిత్ “విశ్వాసం”… వద్దంటున్న స్టార్ హీరోలు
Also Read
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
ఇక తాజాగా “వారియర్” హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఈ భారీ ధర “వారియర్”పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు, ఇటీవల విడుదలైన రామ్ ఫస్ట్ లుక్, టైటిల్ ద్వారా ఏర్పడిన సానుకూల వైబ్స్ కు నిదర్శనం. క్రిమినల్స్ కోసం వేట సాగించే టఫ్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ ని పోస్టర్ లో చూపించారు. దీంతో ఒక్కసారిగా “వారియర్”పై అంచనాలు పెరిగిపోయాయి.
తాజావార్తలు
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!