Ram Pothineni : వారియర్ ఈవెంట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్‌గా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో.. ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ‘ది వారియర్’.. తెలుగు, తమిళ భాషల్లో జులై 14న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దాంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. అందులోభాగంగా.. మొన్న వారియర్ తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో భారీ ఎత్తున జరిపారు. ఈ ఈవెంట్ కోసం తమిళ ఇండస్ట్రీ నుంచి భారీ తారాగణం తరలొచ్చింది. స్టార్ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్, వెట్రిమారన్, భారతీరాజా, గౌతమ్ మీనన్, ఎస్‌జే సూర్య, లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజుతో పాటు.. కార్తీ, విశాల్ వంటి పలువురు సెలబ్రిటీలు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. దాంతో తమిళ్‌లో వారియర్‌కు మంచి హైప్ క్రియేట్ అవుతోంది. పైగా లింగసామికి అక్కడ మంచి మార్కెట్ ఉంది.. హీరో రామ్ సైతం భారీగా ప్రమోట్ చేస్తున్నాడు.. దాంతో అక్కడ కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ఇక తెలుగులోను వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ది వారియర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 10న, అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు.. జేఆర్సి కన్వెన్షన్‌లో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఒక అఫీషియల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో వారియర్ ముఖ్య అథితి ఎవరు.. అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఇక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ది వారియర్‌ను నిర్మిస్తున్నారు. మరి ప్రమోషన్స్, ఈవెంట్స్‌తో అంచనాలను పెంచేస్తున్న వారియర్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి
తాజావార్తలు
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..