Site icon NTV Telugu

War-2 : వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే..?

War 2

War 2

War-2 : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుపుతారనే దానిపై ఎన్నో రూమర్లు వస్తున్నాయి. విజయవాడలో నిర్వహిస్తారనే ప్రచారం మొన్నటి దాకా జరిగింది. వాటన్నింటికీ చెక్ పెడుతూ సితార సంస్థ అధికారికంగా డేట్, ప్లేస్ ప్రకటించింది. వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లోనే నిర్వహిస్తున్నామని తెలిపింది. ఈ నెల 10న ఈవెంట్ ఉండనున్నట్టు ప్రకటించింది.

Read Also : Mega 157 : మెగా-అనిల్ మూవీ నుంచి సాలీడ్ అప్డేట్.. ఎప్పుడంటే..?

సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ స్టార్ట్ అవుతుందని తెలిపింది. ఈవెంట్ కు ఎన్టీఆర్ తప్పకుండా వస్తున్నారు. కానీ హృతిక్ రోషన్ వస్తున్నారా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో మూవీని నిర్మించింది. ఇందులో కియారా హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్, డ్యాన్స్ లపైనే అందరి దృష్టి నెలకొంది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Read Also : Ghati : పాపం అనుష్క.. ఎన్ని వాయిదాలు వేసినా లాభం లేకపాయే..

Exit mobile version