కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ చేసిన రజినీ జైలర్ 2 షూట్ లో పాల్గొంటుంన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా బిగ్గిస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరక్కెక్కుతుంది.
Also Read : Kavya Thapar : బికినీలో కావ్య థాపర్.. బోల్డ్ ఫొటోస్
అలాగే రజనీతో గతంలో పేట సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ కూడా ఓ పాయింట్ చెప్పారు. అయితే ఈ ముగ్గురు కాకుండా మరో డైరెక్టర్ సూపర్ స్టార్ కు లైన్ వినిపించాడు. అతడే టాలీవుడ్ కు చెందిన వివేక్ ఆత్రేయ. బ్రోచేవారెవరురా, సరిపోదా శనివారం, అంటే సుందరానికి వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ఓ పవర్ఫుల్ కథను రజనీకాంత్ కోసం రెడీ చేసాడు. ఇటీవల రజనీను కలిసి పాయింట్ చెప్పగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. వివేక్, రజనీ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. రీసెంట్ గా అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన మైత్రీ ఇప్పుడు రజినీతో సినిమాను లైన్ లో పెట్టింది. ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన త్వరలో రానుంది. ఇప్పటి వరకు శ్రీ విష్ణు, నానిని మాత్రమే డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఎలా చుపిస్తాడోనని క్యూరియాసిటీ నెలకొంది.