Vivek Agnihotri: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదం అంతకంతకు ముదురుతోంది. రణవీర్ సింగ్ ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఫోటోషూట్ చేసిన విషయం విదితమే. ఈ ఫోటోషూట్ పై ఒక ఎన్జీవో పోలీస్ కేసు పెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఈ కేసును పక్కన పెట్టి పలువురు ప్రముఖులు రణవీర్ ను సపోర్ట్ చేయడం విశేషం. ఇప్పటికే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం రణవీర్ ను ప్రశంసించాడు. పురుషుల నగ్న చిత్రాలను చూసి స్త్రీలు ఆనందిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా మరో డైరెక్టర్ రణవీర్ సింగ్ కు మద్దతు పలికాడు. ఇటీవల కాశ్మీర్ ఫైల్స్ చిత్రంతో సంచలనం సృష్టించిన వివేక్ అగ్ని హోత్రి.. ఈ వివాదంపై స్పందించాడు. రణవీర్ పై పెట్టిన కేసు ఒక స్టుపిడ్ కేసని కొట్టిపారేశారు.
రణబీర్ పై నమోదయిన ఎఫ్ఐఆర్ చెల్లదని చెప్పుకొచ్చారు. తాజాగా ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “రణవీర్ చేసిన దాంట్లో తప్పేమి లేదు. అతడిపై పెట్టిన కేసు చెల్లనిది. ఎటువంటి కారణం చూపకుండా పెట్టిన కేసు ఎలా చెల్లుతుంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారని చెప్తున్నారు.. మరి మహిళల నగ్న చిత్రాల సంగతేంటి..? వాటి వలన పురుషుల మనోభావాలు దెబ్బతినడం లేదా..?. మనిషి దేహం దేవుడి అద్భుత సృష్టి.. దానికి ఒక గౌరవం ఉంది. అందుకే ఇలాంటి వాటికి నేను మద్దతు ఇవ్వను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.