Site icon NTV Telugu

Vishwambhara : కీరవాణి ఉండగా భీమ్స్ తో పాట.. కారణం చెప్పిన వశిష్ట

Vashishta

Vashishta

Vishwambhara : వశిష్ట డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర మూవీ స్పీడ్ గా షూట్ జరుగుతోంది. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఓ పాటకు భీమ్స్ ను తీసుకోవడంపై నానా రచ్చ జరుగుతోంది. కీరవాణిని అవమానించారని.. డైరెక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని రకరకాల కామెంట్లు వచ్చాయి. దీనిపై తాజాగా వశిష్ట క్లారిటీ ఇచ్చారు. మేం భీమ్స్ ను కావాలని తీసుకోలేదు. ఈ మూవీ షూట్ లో ఆ పాట కావాల్సివచ్చినప్పుడు కీరవాణి హరిహర వీరమల్లు ఆర్ ఆర్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అటు పక్క వీరమల్లు రిలీజ్ కు దగ్గర పడుతోంది. మాకు ఇటు పక్క షెడ్యూల్ లేట్ అవుతోంది. దీంతో కీరవాణి స్వయంగా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోమని చెప్పారు అంటూ వశిష్ట వివరించారు.

Read Also : Vishwambhara : విశ్వంభర ఆ మూవీకి సీక్వెలా.. వశిష్ట ఏమన్నాడంటే..?

దానికి తాము ముందు ఒప్పుకోలేదని.. కీరవాణి స్వయంగా చిరంజీవికి చెప్పి ఒప్పించారని వశిష్ట తెలిపాడు. ‘కీరవాణి గారిని అవమానించామని బయట చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అందులో నిజం లేదు. నేను కీరవాణి గారి కోసం వెయిట్ చేద్దాం అనుకున్నా. కానీ షెడ్యూల్ లేట్ అవుతుండటం వల్ల కీరవాణి గారే మాకు ఈ సలహా ఇచ్చారు. ఇలాంటివి గతంలో చాలా జరిగాయని.. ఫైనల్ గా సినిమా లేట్ అవ్వకుండా చూడాలన్నారు. అందుకే మేం భీమ్స్ ను తీసుకున్నాం. ఇందులో వేరే ఏం లేదు. మేం అనుకున్న ఔట్ పుట్ భీమ్స్ ఇచ్చాడు. టైమ్ కు షెడ్యూల్ కంప్లీట్ చేశాం’ అంటూ తెలిపారు వశిష్ట.

Read Also : Vishwambhara : రామ్ చరణ్‌ వల్లే విశ్వంభర ఓకే అయిందా.. డైరెక్టర్ క్లారిటీ..

Exit mobile version