Site icon NTV Telugu

Vishwambhara : విశ్వంభరపై అనుమానాలు.. చిరు తేల్చాల్సిందే..

Vishwambhara

Vishwambhara

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బింబిసార డైరెక్టర్ వశిష్టతో చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ వచ్చాక కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ ప్రచారాలు జరిగాయి. కానీ తర్వాత వచ్చిన సాంగ్స్ తో వాటిని కవర్ చేసేశారు మూవీ టీమ్. అయితే రిలీజ్ ఎప్పుడు అనేదానిపైనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి ఈ సినిమా కంటే అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా గురించే హడావిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది.

read also : Off The Record: నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎందుకంత క్రేజ్‌..?

విశ్వంభర కంటే అనిల్ తో చేసే సినిమా నుంచే ఎక్కువ అప్డేట్లు వస్తున్నాయి. విశ్వంభర గురించి ఎలాంటి అప్డేట్ రావట్లేదు. చూస్తుంటే అసలు 2025లో రిలీజ్ ఉంటుందా లేదా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాను జులై 24న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ డేట్ కు రావట్లేదు. పోనీ ఆగస్టులో వస్తుందా అంటే డౌటే. దసరా సీజన్ వరకు అసలే షూటింగే కంప్లీట్ కాదని అంటున్నారు. వీఎఫ్ ఎక్స్ పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయంట. ఈ లెక్కన అసలు 2025 చివరి వరకు అయినా వస్తుందా లేదా అనే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై చిరంజీవి మౌనం వీడి క్లారిటీ ఇవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు. లేదంటే మూవీ గురించి నెగెటివ్ ప్రచారం ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది.

read also : Puri – Sethupathi : పూరీ-సేతుపతి మూవీ పూజా కార్యక్రమం షురూ..

Exit mobile version