మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమా సినిమాకి మంచి వేరియేషన్స్ చూపిస్తున్నాడు. ప్రతి సినిమాకి విశ్వక్ సేన్ తన గ్రాఫ్ తో పాటు పెంచుకుంటూ పోతున్నాడు. దాస్ కా ధమ్కీ సినిమాతో మాస్ హిట్ కొట్టిన విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘VS 11’. ఇటీవలే లాంచ్ అయ్యి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘VS 11’ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ‘VS 11’ టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ ఫస్ట్ గ్లిమ్ప్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పెడుతూ మేకర్స్ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
Read Also: Sanjay Dutt First Look: బిగ్ బుల్గా సంజయ్ దత్.. లుక్ పోలా అదిరిపోలా! కేజీఎఫ్ 2 రేంజ్
విశ్వక్ సేన్ సినిమాల్లో ఇప్పటివరకూ చూడని సెటప్ లో ‘VS 11’ తెరకెక్కుతుంది, నెవర్ బిఫోర్ మాస్ లుక్ లో విశ్వక్ కనిపించనున్నాడు. ఇప్పటివరకూ ఫేస్ రివీల్ చేయకుండా రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్స్ లో విశ్వక్ డిఫరెంట్ గా కనిపించాడు. ఆ లుక్ ని జులై 31న ఉదయం 10:19 నిమిషాలకి రివీల్ చేస్తున్నారు. మరి తన లుక్ విషయంలో పూర్తిగా కొత్తగా కనిపించనున్న విశ్వక్ సేన్ ‘VS 11’ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇస్తున్నాడు. యువన్ అంటేనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కేరాఫ్ అడ్రెస్ కాబట్టి ‘VS 11’కి మంచి బీజీఎమ్ వినే ఛాన్స్ ఉంది.
Bringing you all MASS KA DAS @VishwakSenActor in a never before Rugged Mass Look in #VS11 🔥
Title announcement & First Glimpse on July 31st ~ 10:19 AM 💥#KrishnaChaitanya @thisisysr @vamsi84 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @adityamusic #VS11FirstGlimpse pic.twitter.com/8IuMQOkxJu
— Sithara Entertainments (@SitharaEnts) July 29, 2023