టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కారణంగానే విశ్వక్ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే. గత రెండు రోజుల నుంచి విశ్వక్ పేరు సోషల్ మీడియా లో మారుమ్రోగిపోతుంది. ఒక టీవీ ఛానెల్ డిబేట్ కి వెళ్లి యాంకర్ ని అసభ్యకరమైన పదంతో దూషించడం.. అది కాస్తా వైరల్ గా మారి అతడిపై కేసు నమోదు చేయడం జరిగాయి. ఆ పదం తాను కావాలని అనలేదని సారీ చెప్పినా ఈ వివాదం ముగియకపోవడం గమనార్హం. ఇకపోతే ఈ విషయమై మరోసారి స్పందించాడు విశ్వక్. మంగళవారం ఖమ్మంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో విశ్వక్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తనను కిందకు తొక్కేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదనను పంచుకున్నాడు.
“ఎన్నో కష్టాలుపడుతూ ఇక్కడివరకూ వచ్చాను. ఇంతకంటే కెరియర్లో ఇంకా ఏముంటాయిలే అనుకున్నాను. కానీ చిన్న చిన్న రప్చర్స్ జరుగుతూనే ఉంటాయి. నాకు తెలిసి ఎదుగుదల అంటేఛాలెంజ్ వచ్చినప్పుడు వెళ్లి ఇంట్లో కూర్చోవడం కాదు. ప్రోబ్లం ఎక్కడున్నా దాన్ని తన్ని ఇక్కడికి వచ్చి మీ ముందు నిలబడి కూడా స్మైల్ ఫేస్ పెట్టుకుని మాట్లాడటం. ఎప్పుడూ కూడా ఎవరో నన్నేదో అన్నారని .. నా వైపు వ్రేలు చూపించారని భయపడలేదు .. బాధపడలేదు. నేను బాధపడినదల్లా నాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది .. మమ్మీ .. డాడీ .. అక్కా అని ఉంటారు కదా. నేను ఏమైనా చేసుకుంటానేమోనని వాళ్లు ఆలోచన చేయరా? వారి గురించి కూడా ఆలోచన చేయకుండా కొన్ని జరుగుతున్నాయి. నేను ఒక వ్యక్తికి మాత్రమే ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అమ్మా నీ కొడుక్కి ఏమీ కాదు .. ఎవ్వరూ ఏమీ పీకలేరు .. రాసి పెట్టుకో. ఇలాంటివి చాలా చూశాను. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడని అంటున్నారు. నిన్న నేను ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నోరుమూసుకుని వెళ్లిపోయేవాడిని కాదు. అమ్మా .. నీ కొడుక్కి నువ్వు నేర్పించిన సంస్కారం గురించి అందరికీ తెలుసు .. అందరూ చూశారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి