Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen Legacy: ఇయర్ ఎండ్ బాక్సాఫీస్ బరిలో తన సత్తా చాటాలని భావించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్, చివరి నిమిషంలో తన ప్లాన్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన హీరోగా నటిస్తున్న క్రేజీ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ డిసెంబర్ రిలీజ్ రేసు నుంచి తప్పుకున్నట్లు ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకోవడంతో.. డిసెంబర్ బాక్సాఫీస్ రేసులో విశ్వక్ లేనట్టేనన్న చర్చ మొదలైంది.
సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో విశ్వక్ సేన్, హీరోయిన్ ఏక్తా రాథోడ్‌లతో కూడిన ఒక రొమాంటిక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ చిత్రబృందం డిసెంబర్ 4 రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. ప్రస్తుతం ‘లెగసీ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే, సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటం ఒక కారణమైతే.. డిసెంబర్ మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద విపరీతమైన పోటీ ఉండటం మరో ప్రధాన కారణమని తెలుస్తోంది. అనవసరమైన క్లాష్ ఎందుకని భావించిన మేకర్స్, సాలిడ్ డేట్ కోసం ప్లాన్ మార్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం విశ్వక్ సేన్ తన మరో క్రేజీ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే ‘లెగసీ’ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!