VishnuPriya Subscription : ఒక్క కేసుతో విష్ణుప్రియకి 11 లక్షల లాభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ మీడియా యుగంలో “నెగటివ్ పబ్లిసిటీ” అనేది ఒక వరంగా మారుతోంది. ఒకరిని విమర్శిస్తూ చేసే రచ్చ, పరోక్షంగా వారికే లాభం చేకూరుస్తోందా? అంటే బుల్లితెర నటి, యాంకర్ విష్ణుప్రియ భీమినేని విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. అశ్లీలత పేరిట ఆమెపై నమోదైన కేసు, ఆమె సబ్‌స్క్రిప్షన్ల ఆదాయాన్ని ఊహించని రేంజ్‌కు తీసుకెళ్లింది. విష్ణుప్రియ తన పర్సనల్ ప్లాట్‌ఫారమ్‌లో పెట్టే కంటెంట్ కోసం వసూలు చేసే సబ్‌స్క్రిప్షన్ ఫీజు సుమారు ₹380.
కేసు ముందు: ఆమెపై విజయవాడ AISF (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) వారు ఫిర్యాదు చేయకముందు సబ్‌స్క్రైబర్ల సంఖ్య కేవలం 1,892. అంటే అప్పట్లో ఆమె నెలవారీ ఆదాయం సుమారు ₹7,18,960.
Also Read
Also Read :Tollywood : మే’లో వరుస రీ రిలీజ్ లు!
కేసు తర్వాత: ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు గురించి చర్చ మొదలైందో, విష్ణుప్రియ కంటెంట్ చూసేవారి సంఖ్య అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య 4,832 కి చేరింది. అంటే ప్రస్తుత ఆదాయం అక్షరాలా ₹18,36,160.
కేవలం ఒక్క వివాదం వల్ల ఆమె ఆదాయం ఏకంగా ₹11 లక్షలకు పైగా పెరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
నైతికతను కాపాడాలని AISF నాయకులు కేసు పెట్టారు కానీ, డిజిటల్ ప్రపంచంలో ఒక కంటెంట్‌ను ఎంతగా అడ్డుకోవాలని చూస్తే, దాన్ని చూడాలనే క్యూరియాసిటీ జనాభాలో అంతగా పెరుగుతుంది. విష్ణుప్రియ విషయంలోనూ అదే జరిగింది. మీడియాలో జరిగిన హడావుడి ఆమెకు ‘ఫ్రీ పబ్లిసిటీ’లా మారి, కొత్త కస్టమర్లను ఆమె ప్లాట్‌ఫారమ్‌కు చేరవేసింది. ఈ మొత్తం ఉదంతంలో ఆర్థికంగా విష్ణుప్రియ గట్టిగా లాభపడ్డారు. పబ్లిసిటీ కోసం లక్షలు ఖర్చు చేసినా రాని రీచ్, ఈ ఒక్క కేసు వల్ల ఆమెకు దక్కింది. మరోవైపు, టీఆర్పీల కోసం ఈ విషయాన్ని పదే పదే చర్చించిన మీడియా సంస్థలు కూడా లాభపడ్డాయి. ఇక్కడ నష్టపోయింది ఎవరు? అంటే సమాజంలోని నైతిక విలువలు అని చెప్పక తప్పదు. మొత్తంగా చుస్తే “తప్పు చేస్తే శిక్ష పడుతుందో లేదో కానీ, పబ్లిసిటీ మాత్రం వస్తుంది” అనే సంకేతం యువతలోకి వెళ్లడం ఆందోళనకరం.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!