Vishal :నాకు డూప్ అవసరం లేదు.. 119 కుట్లు పడ్డా నా స్టంట్స్ నేనే చేస్తాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్, తెలుగు సినిమాల్లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు విశాల్ మరోసారి తన రిస్కీ సీన్లతో చర్చల్లోకి వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన కెరీర్‌లో ఎన్ని సార్లు గాయపడినా, స్టంట్స్ చేయడం మానలేదని చెప్పారు. విశాల్ యాక్షన్ ప్రియుడు అనే విషయం మనకు తెలిసిందే. పందెం కోడి, భీమా, పయన్, అభిమన్యుడు, లాఠీ, మార్క్ ఆంటోనీ వంటి సినిమాల్లో ఆయన చేసిన ఫైట్ సీన్స్‌కి ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది. ప్రతి సినిమాలో కొత్త యాక్షన్ డిజైన్, రిస్కీ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటూ వస్తున్నాడు.
Also Read : Athiradi : ‘అతిరథి’ టైటిల్ టీజర్ అవుట్.. టొవినో, బేసిల్ జోసెఫ్‌ల నుంచి సాలిడ్ మాస్ ఎంటర్‌టైనర్ రెడీ !
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
అయితే విశాల్ మాట్లాడుతూ.. “నా శరీరంపై ఇప్పటివరకు 119 కుట్లు పడ్డాయి. చాలా సార్లు గాయపడ్డాను. కానీ, నేను చేసిన యాక్షన్ సీన్స్‌కి ప్రేక్షకులు ఇచ్చే స్పందన చూసి ఆ బాధ అన్నీ మర్చిపోతాను. సినిమాల్లో డూప్ వాడటం నాకు ఇష్టం లేదు. నేను నటించే యాక్షన్ సీన్స్‌ని నేనే చేయడం కిక్ ఇస్తుంది. సినిమా అంటే యాక్షన్, ఎమోషన్ మిక్స్ అయి ఉండాలి. నేను చేసే స్టంట్స్ రియలిస్టిక్‌గా ఉండాలని కోరుకుంటాను. అందుకే డుబ్ అవసరమని అనిపించినా, చాలాసార్లు నేనే చేస్తాను. ప్రమాదం జరుగుతుందనే భయం ఉండదు, కానీ సేఫ్టీ మెజర్స్ మాత్రం తప్పకుండా తీసుకుంటాం. అయినప్పటికి ఎన్నో సార్లు ప్రమాదాలు ఎదుర్కొన్నా. ఒక సినిమాలో బైక్ స్టంట్ షూట్ సమయంలో కిందపడి కాలు ఫ్రాక్చర్ అయింది. మరోసారి గ్లాస్ యాక్షన్ సీన్‌లో చేతికి లోతైన గాయం కావడంతో 17 కుట్లు వేయాల్సి వచ్చింది. కానీ ప్రేక్షకుల కోసం చేస్తున్నపుడు ఆ బాధలు అన్నీ చిన్నవి గా అనిపిస్తాయి” అంటూ విశాల్ చిరునవ్వుతో అన్నారు.
ఇక విశాల్ ఫ్యాన్స్ మాత్రం “అంత రిస్క్ ఎందుకండి అన్నా! మీ సేఫ్టీ ముందు ముఖ్యం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ విశాల్ మాత్రం తన స్టైల్ మార్చే ప్రసక్తే లేదంటున్నాడు. “సినిమా అంటే ప్యాషన్.. నేను చేసే స్టంట్ ఒక్కటి కూడా ఫేక్‌గా అనిపించకూడదు.. అందుకే డూప్‌లు వద్దు” అంటున్నాడు ఈ యాక్షన్ మాన్. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న తాజా చిత్రం థూప్పరి వాలాన్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని టాక్. అలాగే ఆయన ప్రొడక్షన్‌లో మరో చిత్రం కూడా ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!