Vishal : తన ఆరోగ్య పరిస్థితి గురించి నోరు విప్పిన విశాల్
- విశాల్ ఆరోగ్య పరిస్థితి
- మొదటి సారిగా నోరు విప్పిన విశాల్
- నా తుది శ్వాస వరకు మీ అభిమానాన్ని మర్చిపోను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజాలు తెలియకుండా ఆయన హెల్త్ గురించి వరుస పుకార్లు పుట్టిస్తున్నారు. ఇక తాజాగా శనివారం సాయంత్రం ‘మద గజ రాజ’ ప్రీమియర్ కు హజరైన విశాల్.. తన ఆరోగ్యం పై వస్తున్న వార్తల పై స్పందించారు.
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
విశాల్ మాట్లాడుతూ ‘మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. ఆయనంటే నాకెంతో ఇష్టం. నా తండ్రిని చూసి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్న. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెళ్లిపోతున్నానని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యలు లేవు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్ కూడా కరెక్ట్ పట్టుకోగలుగుతున్నా ఇటీవల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. గెట్ వెల్ సూన్, కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలే నన్ను కోలుకునేలా చేశాయి. నా తుది శ్వాస వరకు మీ అభిమానాన్ని మర్చిపోను’ అని విశాల్ తెలిపారు. నిజంగా విశాల్ చెప్పినట్లుగానే లాస్ట్ ఈవెంట్‌తో పోలిస్తే ఇందులో ఆయన ఆరోగ్యంగా, చాలా ఫిట్ గా కనిపించారు.
తమ హీరో మాటలు విన్న అభిమానులకు మనసు కొంత కుదుట పడింది . ఇంకా పూర్తిగా కోలుకుని మునుపటి విశాల్ గా మేము మిమ్మల్ని చూడాలి అని ఫ్యాన్స్ కోరుతున్నారు. విశాల్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను తమిళ్ లో నటించిన ప్రతి ఒక సినిమా తెలుగులో కూడా విడుదల అవుతాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా విశాల్ పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!