Vintara Saradaga Release Date: నూతన సంవత్సర కానుకగా గౌరీ ప్రియ ‘వింటారా సరదాగా’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vintara Saradaga Release Date: నూతన సంవత్సరానికి వినోదభరితమైన ఆహ్వానం పలికేందుకు యంగ్ హీరో, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సిద్ధమవుతున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘VISA-వింటారా సరదాగా’ ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉద్భవ్ రఘు దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రేమ, స్నేహం, సరదా, యువత జీవితంలోని అనుభవాల కలయికగా తెరకెక్కింది.
కలలను సాకారం చేసుకోవాలనే ఆశయంతో స్వదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లే తెలుగు విద్యార్థుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విదేశాల్లో విద్యార్థుల జీవనశైలి, స్నేహాలు, ప్రేమలు, అనుకోని సంఘటనలు, ఎదురయ్యే ఆసక్తికరమైన పరిస్థితులను వినోదాత్మకంగా ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. అశోక్ గల్లా, గౌరీ ప్రియ మధ్య కెమిస్ట్రీ, యూత్‌ఫుల్ కథాంశం, వినోదభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వింటారా సరదాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా ప్రేక్షకుల్లో మంచి స్పందనను సొంతం చేసుకుంటున్నాయి. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న 'మహానటి'!
- Dhurandhar 2 vs Ramayan: 'ధురంధర్ 2' వర్సెస్ 'రామాయణ'.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
- Chiranjeevi: 'మెగాస్టార్' ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
- Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
వింటారా సరదాగాలో అశోక్ గల్లా, గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఎస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 1న విడుదల కానున్న ఈ సినిమా యువతను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Vintara Saradaga Release Date: నూతన సంవత్సర కానుకగా గౌరీ ప్రియ ‘వింటారా సరదాగా’!
-
CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
-
Trump Asia Tour: చైనాలో ఒకే వేదికపై ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్.. తొలిసారి చరిత్రాత్మక భేటీ!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!