Virat Kohli: ప్రతి మ్యాచ్‌కు ముందు విరాట్ తప్పకుండా వినే ఒక్క పాట ఇదే.. ఆ పాట వెనుక అంత స్టోరీ ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: మైదానంలో విరాట్ కోహ్లీ కనిపిస్తే ప్రత్యర్థి జట్టుకు టెన్షన్ మొదలవుతుంది. అయితే ఒత్తిడిని అవకాశంగా మార్చుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించడం అతని ప్రత్యేకత. కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ స్టార్ క్రికెటర్‌ను కూడా కొన్ని జ్ఞాపకాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. మ్యాచ్‌కు వెళ్లే ముందు అతడు తప్పకుండా వినే ఒక పాట ఉందని, ఆ పాటకు తన జీవితంతో దగ్గర సంబంధం ఉందని స్వయంగా కోహ్లీ వెల్లడించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పాట ఏంటి ? దానితో విరాట్‌కు ఉన్న అనుబంధం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
ఢిల్లీలో తన ‘వన్8 కమ్యూన్’ బ్రాండ్ గ్లోబల్ ప్రీమియర్ కార్యక్రమాన్ని విరాట్ కోహ్లీ ఘనంగా నిర్వహించాడు. ద్వారకాలోని యశ్ భూమిలో జూన్ 21న జరిగిన ఈ ఈవెంట్‌కు ప్రముఖ పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా కూడా హాజరయ్యాడు. తమ తమ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు భారీగా స్పందించారు. కార్యక్రమంలో కరణ్ ఔజ్లాతో మాట్లాడిన విరాట్, అతని సంగీతంపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
Also Read
- Cocktail 2 : అదరగొడుతున్న కాక్టెయిల్ - 2.. మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
- Rashmika Mandanna: పాన్ ఇండియా బాక్సాఫీస్ క్వీన్‌గా దూసుకెళ్తున్న రష్మిక.. రూ.4,000 కోట్లకు పైగా వసూళ్లతో అరుదైన ఘనత!
- MaaInti Bangaaram : 'మా ఇంటి బంగారం' కోసం పోటెత్తిన మహిళలు
- Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరపు న్యాయవాది!
తన కెరీర్ ప్రారంభమైన రోజుల నుంచే కరణ్ ఔజ్లా పాటలను వింటున్నానని విరాట్ తెలిపాడు. ముఖ్యంగా ‘విన్నింగ్ స్పీచ్’ అనే పాట తనకు అత్యంత ఇష్టమని చెప్పాడు. ప్రతి మ్యాచ్‌కు వెళ్లే ముందు ఆ పాటను ఎన్నోసార్లు వింటానని వెల్లడించాడు. ఆ పాటలో కరణ్ జీవితంలోని పోరాటం, కష్టాల నుంచి విజయానికి చేరుకున్న ప్రయాణం ఎంతో హార్ట్ టచింగ్ గా కనిపిస్తుందని, అందులో తన జీవితానికి కూడా ఎన్నో పోలికలు కనిపిస్తాయని విరాట్ వివరించాడు.
ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలోని ఒక ఎమోషన్ ను కూడా విరాట్ పంచుకున్నాడు. చాలా చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయానని, జీవితంలో ఎదురైన ఆ బాధ తనను మరింత దృఢంగా మార్చిందని చెప్పాడు. అందుకే ‘విన్నింగ్ స్పీచ్’ పాట విన్న ప్రతిసారీ తన లైఫ్ ట్రావెల్ గుర్తుకు వస్తుందని తెలిపాడు. ఆ భావోద్వేగ అనుబంధమే ప్రతి మ్యాచ్‌కు ముందు ఆ పాటను వినేలా చేస్తుందని చెప్పడం అభిమానులను కదిలించింది.
అదే కార్యక్రమంలో తన ఆటతీరుపైనా విరాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ పూర్తిగా ప్రత్యర్థి ఆధిపత్యంలో ఉన్నట్లు కనిపించే సందర్భాలే తనకు ఎక్కువ సవాల్‌గా అనిపిస్తాయని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లోనే తనలోని అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుందని, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా అందులో గెలిచే చిన్న అవకాశాన్ని వెతకడం తన అలవాటని వివరించాడు. అదే తన విజయాల వెనుక ప్రధాన కారణమని కూడా పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా, కరణ్ ఔజ్లా తాజాగా విడుదల చేసిన ‘లవ్ ఫేడ్స్’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ చెప్పిన ఈ వ్యక్తిగత విషయం అభిమానులకు అతని వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని పరిచయం చేసింది. విజయాల వెనుక కఠినమైన పోరాటం, మరిచిపోలేని ఎమోషన్స్ కూడా ఉంటాయని మరోసారి గుర్తుకు చేస్తున్నాయి కోహ్లీ వ్యాఖ్యలు.
- Tags
- cinema
- Karan Aujla
- VIRAT KOHLI
తాజావార్తలు
-
Cocktail 2 : అదరగొడుతున్న కాక్టెయిల్ – 2.. మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
-
Virat Kohli: ప్రతి మ్యాచ్‌కు ముందు విరాట్ తప్పకుండా వినే ఒక్క పాట ఇదే.. ఆ పాట వెనుక అంత స్టోరీ ఉందా?
-
Qatar Gas Plant Explosion: గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
-
Aprilia Tuono 457 Special Edition: ఏప్రిలియా Tuono 457 Special Edition విడుదల.. అదిరే ఫీచర్లు, ధర వివరాలు
-
Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!