Asuraguru: ‘ఆహా’లో క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’.. ఇంట్రెస్ట్ పెంచేస్తున్న ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikram Prabhu Asuraguru Telugu Trailer :విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అసురగురు గతంలో తమిళంలో రిలీజ్ అయింది. ఎ. రాజ్‌దీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని JSB సతీష్ నిర్మించగా ఈ సినిమాను తెలుగులో ఓటీటీ ఆడియన్స్ కోసం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ కనుక చూస్తే ట్రైన్ హీస్ట్ సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. విక్రమ్ ప్రభు పెర్ఫార్మెన్స్ హైలెట్. ఇక విక్రమ్ ప్రభు తన తొలి బ్లాక్ బస్టర్ తొలి చిత్రం ఇవాన్ వేరెమదిరి (సిటిజన్ పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది) నుండి తన కెరీర్‌లో ఎప్పుడూ యాక్షన్ థ్రిల్లర్‌లతో అలరిస్తుంటాడనే పేరుంది.
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డికి స్టార్ హీరో మాజీ భార్య స్ట్రాంగ్ కౌంటర్?
Also Read
- NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
- Jagapathi Babu : 'పెద్ది'ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
- Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్... అసలేం జరుగుతోంది ?
- Ram Charan : RC17 పై 'పెద్ది' ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
తమిళంలో తాజా హిట్ చిత్రం ఇరుగపట్రుతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన విక్రమ్ ప్రభు ఇప్పుడు అసురగురుతో థ్రిల్ పంచబోతున్నారు. ఇక ఇందులో హీరోయిన్ మహిమా నంబియార్ పాత్ర స్ట్రీట్ స్మార్ట్ డిటెక్టివ్‌గా తీర్చిదిద్దారు. ఈ చిత్రం రైలు హీస్ట్ సీక్వెన్స్‌తో ప్రారంభమౌతోంది. తమిళనాడులో కొన్నేళ్ల క్రితం జరిగిన నిజ జీవితంలో జరిగిన దోపిడీ నుంచి స్ఫూర్తితో ఈ కథని తీర్చిదిద్దారని అంటున్నారు ఇందులో హీరో క్లెప్టోమేనియా అనే జబ్బుతో ఇబ్బందిపడుతుంటారు. ఈ క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు మేకర్స్. యోగి బాబు, ఎలాంగో కుమారవేల్ , సుబ్బరాజు, అనుపమ కుమార్, నాగినీడు, సంపత్ రామ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రానికి గణేష్ రాఘవేంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ సమకూరుస్తున్నారు. ఇక మే3న ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్‌లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!