Largo Winch: సీడీలు ఇస్తే చరణాలు వేసి ఇస్తారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున హీరోగా, దర్శకుడు శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ‘కింగ్’ మూవీ అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని అంత కన్నా ఎక్కువ పాపులర్ అవుతోంది. ఈ మూవీలోని బ్రహ్మానందం సీన్స్ ని మీమ్స్ కి టెంప్లేట్స్ గా వాడుతున్నారు మీమర్స్. ఎన్నో ఫన్నీ మీమ్స్ కి టెంప్లేట్స్ ఇచ్చిన కింగ్ మూవీ నుంచి కొత్తగా మరో మీమ్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దళపతి విజయ్ హీరోగా నటించిన ‘వారిసు/వారసుడు’ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ జనవరి 11న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, తాజాగా ‘వారసుడు’ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఎన్నో తెలుగు సినిమాలని గుర్తు చేసేలా ‘వారసుడు’ ట్రైలర్ ఉందంటూ ట్విట్టర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ‘కింగ్’ సినిమాలోని బ్రహ్మానందం, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి డైలాగ్ ని ఒకటి పెట్టి ఒక మీమ్ చేశారు. కింగ్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా నటించిన బ్రహ్మానందం ఒక సాంగ్ ని హమ్ చేసి, శ్రీనివాస్ రెడ్డిని ఎలా ఉందిరా అని అడిగితే దానికి సమాధానంగా శ్రీనివాస్ రెడ్డి “ఆజ్ ఇట్ ఈజ్ ఉంది, సీడీలు ఇస్తే చరణాలు’ వేసి ఇస్తారు” అంటాడు. ఆ తర్వాత ఏ సినిమా, ఏ సాంగ్ ఇంకో దానికి కాపీగా కనిపించినా వెంటనే మీమర్స్ “సీడీలు ఇస్తే చరణాలు వేసి ఇస్తారు, ఆజ్ ఇట్ ఈజ్” ఉంది అంటూ మీమ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ‘వారసుడు’ ట్రైలర్ కూడా చేరింది. ఈ ట్రైలర్ ని చూడగానే ‘లార్గో వించ్’ సినిమాలా ఉంది అనిపించగానే బ్రహ్మానందం, శ్రీనివాస్ రెడ్డిలని పెట్టి మీమ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2008లో రిలీజ్ అయిన ఫ్రెంచ్ యాక్షన్ మూవీ ‘ది హెయిర్ అప్పారెంట్: లార్గో వించ్’. జేరోమి సల్లే డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫ్రెంచ్ లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. తెలుగులో ఇదే సినిమాని అటు ఇటు మార్చి మాటల మాంత్రికుడు ‘అజ్ఞాతవాసి’ సినిమా చేశాడు. పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికీ మెగా అభిమానులకి ఒక పీడ కలగానే మిగిలింది. ఆ తర్వాత బాహుబలి హీరో ప్రభాస్ ని పెట్టి ‘లార్గో వించ్’ సినిమానే ‘సాహో’గా తెరకెక్కించాడు ‘సుజీత్’. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఒకే కథని ఇన్స్పిరేషన్ గా తీసుకోని రూపొందిన ఈ రెండు భారి సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయ్యాయి. ఒకే కథతో సినిమా ఎలా చేశారు అంటూ సాహో మేకర్స్ పైన విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ‘వారసుడు’ ట్రైలర్ ని చూసిన వాళ్లు ‘లార్గో వించ్’ సినిమాని ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన ‘వారసుడు’ సినిమా నిజంగా ‘లార్గో వించ్’ సినిమాకి ఇన్స్పిరేషనా కాదా అనేది తెలియాలి అంటే జనవరి 11 వరకూ ఆగాల్సిందే.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!