Site icon NTV Telugu

విజయ్ సేతుపతి సరికొత్త రికార్డు… సౌత్ లోనే మొదటిసారి !

Vijay Sethupathi to act in two web series and 13 Movies

సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. తాజాగా ఆయన సరికొత్త రికార్డును సెట్ చేశారు. ఓకే నెలలో ఆయన నటించిన 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీనితో సెప్టెంబర్ లో ఓటిటి వేదికగా ఈ రికార్డు నమోదు కాబోతోంది. శృతి హాసన్, సేతుపతి జంటగా నటించిన “లాభం” చిత్రం సెప్టెంబర్ 9 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. అదే నెలలో 11న “తుగ్లక్ దర్బార్”, 17న “అన్నాబెల్లె సేతుపతి” 24న “కడై శివవాసాయి” వరుసగా ప్రీమియర్ కానున్నాయి.

Read Also : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. రేపటి నుంచే ఈడీ విచారణ

“అన్నాబెల్లె సేతుపతి” డిస్నీ హాట్‌స్టార్‌లో, “కడై శివవాసాయి” సోనీ లైవ్ లో విడుదల చేస్తున్నారు. విజయ్ సేతుపతి, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన “తుగ్లక్ దర్బార్” ట్రైలర్ ఆగస్ట్ 31న విడుదల అవుతుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన “తుగ్లక్ దర్బార్‌”కు ఢిల్లీ ప్రసాద్ దీనదయాళన్ దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌లో లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. మరోవైపు దీపక్ సుందరరాజన్ దర్శకత్వంలో “అన్నాబెల్లె సేతుపతి” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిజానికి ఒక హీరో సినిమాలు అది కూడా ఒకే నెలలో 4 సినిమాలు విడుదల కావడం ఇదే మొదటిసారి.

ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి వరుస సినిమాలతో మంచి ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ… ఇలా అన్గాన్ని భాషల్లోనూ హీరోగానే కాకుండా విలన్ వంటి పవర్ ఫుల్ రోల్స్ పోషిస్తూ సినీ ప్రేమికులకు అలరిస్తున్నారు.

Exit mobile version