NTV Telugu Site icon

Vijay Sethupathi: పవన్ కళ్యాణ్ పై విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

Pawan

Pawan

Vijay Sethupathi Shocking Comments on Pawan kalyan: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే చాలా మంది సినీరంగానికి చెందినవారు ఈ విషయం మీద మాట్లాడగా తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి సైతం పవన్‌ కళ్యాణ్‌ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ సేతుపతి నటించిన ‘మహారాజా’ అనే సినిమాఈ నెల 14న తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదలవుతుండడంతో హైదరాబాద్‌లో ప్రెస్‌ మీట్‌లో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు పవన్‌ కళ్యాణ్‌ విజయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనకి నా బెస్ట్‌ విషెస్‌, పవన్ కష్టాన్ని గౌరవిస్తా, ఆయన గెలవడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు చాలా ట్రోల్స్‌ వచ్చాయని విన్నా, అంతేకాదు ఆయన తొడకొట్టే వీడియో ఒకటి నేను చూశాను.

Nandini Reddy: తీవ్ర విషాదంలో నందిని రెడ్డి.. ఏమైందంటే?

పవన్‌ కళ్యాణ్‌ చాలా మాస్‌, ఆ స్థిరత్వం అనేది చాలా ముఖ్యం. వేరేవాళ్ల కథలో ఆయన హీరో కాదు, ఆయన కథలో ఆయనే హీరో. మనిషికి అలాంటి మానసిక బలం చాలా అవసరం అని సేతుపతి అన్నారు. నాకు పవన్‌ కళ్యాణ్‌ గురించి ఏమీ తెలియదు కానీ నా వాట్సాప్‌లో కొందరు తెలుగు వ్యక్తులు పెట్టే పవర్‌ స్టార్‌ వీడియోల స్టేటస్‌లు చూసి అసలు ఏమైంది, ఏంటి అని వాళ్లను అడిగా. నిజానికి నాకు అసలు ఏం జరిగిందో తెలియదు. వాళ్లు నాకు చాలా విషయాలు చెప్పారు, పవన్‌ కళ్యాణ్‌ కేవలం సినిమాల్లో మాత్రమే మాస్‌ కాదు, రియల్‌ లైఫ్‌లో కూడా మాస్‌ అని అప్పుడే తెలిసింది. ఎవరైతే ఇలాంటి ట్రోల్స్‌, మీమ్స్‌ ఎదుర్కొని మానసికంగా ధృడంగా ఉండడం మామూలు విషయం కాదని అన్నారు.

Show comments