Nandini Reddy Sister Died : తెలుగులో విలక్షణమైన సినిమాలు చేస్తారనే పేరు ఉన్న దర్శకురాలు నందిని రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు. మన దగ్గర వాళ్ళని కోల్పోవడం అంత ఈజీ ఏమీ కాదు. నాతో కలిసి పెరిగిన వాళ్ళలో ఒకరిని దూరం చేసుకోవడం ఇదే మొదటిసారి. నన్ను మొట్టమొదటిసారిగా అక్క అని పిలిచింది శాంతినే. శాంతి నాకు తెలిసినంతలో చాలా దయ కలిగిన వ్యక్తి, ఎలాంటి కల్మషం లేని ఆమె నవ్వు ఆమెకు అత్యంత బలమైన విషయం అని నమ్ముతాను. అదే బలంతో అదే చిరునవ్వుతో ఒక పెద్ద యుద్ధంలో ఆమె పాల్గొన్నది. గత నాలుగు నెలల నుంచి ఎంతో కష్టపడి పోరాడుతోంది. ఈరోజు ఆమెకు సమయం వచ్చేసింది.
Sonakshi Sinha: రెండేళ్ల చిన్నవాడైన ప్రియుడుతో పెళ్ళికి రెడీ అయిన సోనాక్షి సిన్హా.. ఎవరో తెలుసా?
ఆమె ఒక బెస్ట్ కుమార్తె, ఒక బెస్ట్ సోదరి, ఒక బెస్ట్ వైఫ్ అలాగే ఒక బెస్ట్ తల్లి ఒక బెస్ట్ ఫ్రెండ్. నా డార్లింగ్ చెల్లెలా నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం, మరొకపక్క మనం కలిసే వరకు అంటూ ఆమె తన సోషల్ మీడియా వేదికగా తన సోదరి ఫోటో షేర్ చేసింది. అయితే ఆమె ఎలా చనిపోయారు అనే విషయం మీద పూర్తిగా క్లారిటీ లేదు. బహుశా నందిని రెడ్డి చెబుతున్నదాని ప్రకారం ఆమె క్యాన్సర్ తో పోరాడుతూ చనిపోయి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద నందిని రెడ్డి క్లారిటీ ఇస్తే తప్ప అసలు ఏం జరిగిందనే విషయం మీద అవగాహన వచ్చే అవకాశం లేదు. అయితే ఈ విషయం తెలిసి ఆమె పడుతున్న ఆవేదనను అభిమానులు అర్థం చేసుకుంటూ ఆమెకు అండగా ఉంటామంటూ కామెంట్స్ చేస్తున్నారు