Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ ఎలివేషన్స్, హీరోయిన్స్‌తో రొమాన్స్, రఫ్ లుక్‌లో నలుగురు విలన్స్‌ని ఒంటి చేత్తో మట్టి కరిపించడమే టాలీవుడ్ హీరోయిజం. ఈ కమర్షియల్ ఫార్మాట్‌కి తమిళ్ హీరోస్ కాస్త దూరం. “హీరోస్ అంటే నీట్‌గానే ఉండాలా? మాసిన బట్టలతో మురికివాడల్లో తిరగకూడదా?” అంటూ హీరోయిజానికి కొత్త అర్థం చెప్తున్నారు. టాలీవుడ్ హీరోలు కమర్షియల్ ఫార్మేట్ దాటి సినిమాలు చేయరు, చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు. కానీ తమిళ తంబీలు కాస్త డిఫరెంట్ కదా! స్టీరియో టైప్ క్యారెక్టర్లను కాదని డిఫరెంట్ జానర్స్, రోల్స్ ట్రై చేస్తూ ఉంటారు. హీరోలు అంటే ఇలాగే ఉండాలన్న కొలతలేవీ పెట్టుకోరు, అవసరమైతే బెగ్గర్ వేషాలకైనా సై అంటారు. ‘బిచ్చగాడు’తో విజయ్ ఆంటోనీ ఇదే ప్రూవ్ చేశాడు. ఆ మూవీ భారీ సక్సెస్ అందుకోవడంతో, ఈ బాటే పట్టారు ఇంకొంతమంది స్టార్ హీరోస్. విజయ్ ఆంటోనీ తర్వాత రైజింగ్ యాక్టర్ కవిన్ కూడా ‘బ్లడీ బెగ్గర్’ అంటూ బిచ్చగాడి వేషం వేస్తే బెడిసి కొట్టింది. స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయినా కోలీవుడ్ హీరోలు బెగ్గర్ వేషాలపై మనసు చంపుకోలేకపోతున్నారు.
కోలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇలాంటి స్టోరీలకు సై అంటున్నారు. గత ఏడాది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’లో ధనుష్ బిచ్చగాడి రోల్ చేసి మెప్పించాడు. విజయ్ సేతుపతి కూడా టాలీవుడ్ ప్రాజెక్ట్‌లో ఈ తరహా రోల్ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ అప్‌కమింగ్ ఫిలిం ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’ మూవీలో బెగ్గర్‌గా కనిపించబోతున్నాడు మక్కల్ సెల్వన్, అయితే వైలెంట్ రోల్లో చూపిస్తున్నాడు పూరి జగన్నాథ్. ఇందులో విజయ్ను ఓవైపు గుడ్డివాడిగా నటింపజేస్తూ.. మరోవైపు నరమేధం సృష్టిస్తున్నాడు. టబుని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడు డైరెక్టర్. సంయుక్త హీరోయిన్. టాలీవుడ్ బాట పట్టినా కూడా ఈ తమిళ వాసనలను మిస్ కావట్లేదు హీరోస్, మరి ఈ సినిమాను టాలీవుడ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో!
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!