Puri-Sethupathi : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచే ఇంట్రెస్ట్ పెంచుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడనేదానిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా విజయ్ ఈ మూవీ సెట్స్ లో అడుగు పెట్టాడు. నిన్న హైదరాబాద్ చేరుకున్న విజయ్ మూవీ షూట్ ను స్టార్ట్ చేశాడు. అయితే విజయ్-నిత్యామీనన్ నటించిన ‘తలైవాన్ తలైవి’ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా సెట్స్ లో సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ వైబ్ కనిపిస్తోంది అంటూ మూవీ టీమ్ ట్వీట్ చేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : WAR 2 Trailer Review : అదిరిన విజువల్స్.. యాక్షన్ సీన్స్ సూపర్బ్..
విజయ్-నిత్యా మీనన్ నటించిన ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా రాబోతోంది. ఇక పూరీ జగన్నాథ్-విజయ్ కాంబోలో వస్తున్న మూవీ డిఫరెంట్ కథతో వస్తోంది. బెగ్గర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. దీన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ మీద చార్మీ, పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. పూరీ జగన్నాథ్ ఇప్పటి వరకు చేసిన మాస్, యాక్షన్ డ్రామా కాకుండా.. ఒక హ్యూమన్ యాంగిల్ లో ఈ సినిమా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న పూరీ.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
Read Also : HHVM : బాయ్ కాట్ ట్రెండ్.. వీరమల్లుకు కలిసొచ్చిందే..
Blockbuster vibes already💥
Team #PuriSethupathi celebrated the magic of our dearest Makkal Selvan @VijaySethuOffl’s #SirMadam – #ThalaivanThalaivii, which is off to a flying start💥
The excitement is sky-high to witness it on the big screens!@MenenNithya @pandiraaj_dir pic.twitter.com/QPCuMr6K2S
— Puri Connects (@PuriConnects) July 25, 2025