Vijay Sethupathi Interesting Comments On Political Entry: సినీ పరిశ్రమకు, రాజకీయాలకు ఎప్పటి నుంచో అవినాభావ సంబంధం ఉంది. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నటీనటులు.. సరైన సమయం చూసుకొని, పాలిటిక్స్‌లోకి అడుగిడుతుంటారు. రాజకీయ పార్టీలు కూడా.. జనాల్లో ఆయా సినీతారలకు ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి, తమ పార్టీల్లోకి ఘనంగా ఆహ్వానిస్తుంటాయి. పెద్ద పెద్ద పదవులు ఆఫర్ చేస్తుంటాయి. అందుకే.. పాపులారిటీ గడించిన తారలపై రాజకీయ అరంగేట్రాలకు సంబంధించి తరచూ వార్తలు వస్తుంటాయి. కొందరైతే.. ఊహించని ట్విస్టులు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా అలాంటి బిగ్ ట్విస్టే ఇచ్చాడు.
Kane Williamson: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి కేన్ ఔట్
తన ఇన్నేళ్ల కెరీర్‌లో విజయ్ సేతుపతి రాజకీయాల వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకుంది లేదు. కేవలం తన కెరీర్‌పైనే దృష్టి సారించాడే తప్ప.. పాలిటిక్స్‌లో తనకు ఆసక్తి ఉన్నట్టు ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు. ఒకట్రెండు సందర్భాల్లో రాజకీయ వ్యవహారాలపై పెదవి విప్పి ఉండొచ్చేమో గానీ.. అంతకుమించి చమత్కారాలైతే ఇవ్వలేదు. అలాంటి సేతుపతి తాజాగా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తనకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందని కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు.. ఇప్పటి యువత రాజకీయాల గురించి తెలుసుకోవాలని కూడా సూచించాడు. కానీ.. తాను రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తానన్న విషయంపై క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్‌గానే ఉంచేశాడు.
Vijay Yesudas: యేసుదాసు తనయుడి ఇంట్లో భారీ చోరీ.. నగలు, పత్రాలు మాయం
డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ పుట్టినరోజును పురస్కరించుకొని.. చెన్నైలోని తేనాంపేటలో ‘స్టాలిన్ 70’ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ్ సేతుపతి విచ్చేశాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘‘సీఎం స్టాలిన్ వారసత్వంతో ముఖ్యమంత్రి కాలేదు. కఠోర శ్రమతో సీఎంగా ఎదిగారు. ఇప్పటి యువత రాజకీయాల గురించి తెలుసుకోవాలి. నా విషయానికొస్తే.. నాకు రాజకీయాల గురించి ప్రతీది తెలుసు. కానీ, ఇప్పుడే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే నాకు లేదు. కానీ.. భవిష్యత్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడాయన మాటలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.