Vijay Sethupathi : తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పాడు. తన కొడుకు చేసిన పనికి ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని వేడుకున్నాడు. అసలు విషయం ఏంటంటే.. సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఫీనిక్స్ సినిమాతో మొన్ననే ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ పెద్దగా కలెక్షన్లు అయితే రావట్లేదు. కాగా ఈ సినిమా ప్రీమియర్ షో లోనే తీవ్ర వివాదం నెలకొంది. ప్రీమియర్ షో, ప్రమోషన్ల సమయంలో సేతుపతి కొడుకు సూర్య ప్రవర్తనపై మీడియాలో, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆ వీడియోలను తొలగించాలంటూ మీడియాపై సూర్య టీమ్ ఒత్తిడి తెచ్చిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
Read Also : Anil Ravipudi : సుడిగాలి సుధీర్ ను వాళ్లే రోస్ట్ చేయమన్నారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
దీంతో విజయ్ సేతుపతి నేరుగా ఎంట్రీ ఇచ్చారు. తన కొడుకు చేసిన పనికి తాను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. ఇది ఎవరు చేశారో తెలియదు.. ఒకవేళ నిజంగా జరిగి ఉంటే ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి అని కోరాడు సేతుపతి. ఇక ఫీనిక్స్ మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్. దేవదర్శిని, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జులై 4న మూవీ రిలీజ్ అయి హిట్ టాక్ సంపాదించుకుంది. మొదటి సినిమా అయినా సూర్య బాగా పర్ఫార్మ్ చేశాడంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఇదే టైమ్ లో సిద్దార్థ్ మూవీ 3బీహెచ్‌కే తో సూర్య సినిమాకు పెద్దగా కలెక్షన్లు రావట్లేదు. కేవలం రూ.10లక్షలు మాత్రమే వచ్చాయి. సూర్య సినిమాలో బాగానే నటిస్తున్నాడు గానీ.. బయట అతని ప్రవర్తనలో ఇంకా మార్పులు రావాలంటున్నారు విజయ్ సేతుపతి అభిమానులు.
Read Also : Surya Sethupathi: విజయ్ సేతుపతి కొడుకుపై ప్రశంసల వర్షం.. కానీ డిజాస్టర్ కలెక్షన్?
